ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈవీఎంల తరలింపు

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:04 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన తదుపరి ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈవీఎంలను పోలీస్‌ బందోబస్తు నడుమ వాహనాల్లో తరలిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరావు తెలిపారు.

సూర్యాపేట నుంచి ఈవీఎంల తరలింపును పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటరావు, ఎస్పీ రాహుల్‌హెగ్డే

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటరావు

సూర్యాపేట సిటీ, ఏప్రిల్‌ 18 : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన తదుపరి ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈవీఎంలను పోలీస్‌ బందోబస్తు నడుమ వాహనాల్లో తరలిస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ ఆవరణలోని గోదాంలో ఈవీఎం తరలింపు ప్రక్రియను ఎస్పీ రాహుల్‌ హెగ్డే, అదనపు కలెక్టర్లు సీహెచ ప్రియాంక, బీఎస్‌ లతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 25 శాతంతో రిజర్వ్‌తో బీయూలు 1,500, సీయూలు 1,500, వీటితో పాటుగా 40శాతం రిజర్వ్‌తో 1,680 వీవీప్యాట్‌లు ఏఆర్‌వోల ఆధ్వర్యంలో పోలీ్‌సభద్రత నడుమ వాహనాల్లో తరలించామన్నారు.అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ల సా్ట్రంగ్‌రూంలో భద్రత, తదుపరి రెండో ర్యాండమైజేషన నిర్వహణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ ఆర్డీవోలు వేణుమాధవ్‌, సూర్యానారాయణ, శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

పాఠశాలల్లో పనులు వేగంగా పూర్తిచేయాలి

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకటరావు ఆదేశించారు. గురువారం డీఈవో, ఎంఈవోలు, హెచఎంలు, కాంప్లెక్స్‌ హెచఎంలు, నోడల్‌ ఆఫీసర్లతో ఆయన వెబ్‌ఎక్స్‌ కాన్ఫరెన్స నిర్వహించారు. పోలింగ్‌ బూతలు ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పోలింగ్‌ తేదీలోపు పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. పాఠశాలల్లో ప్రధానమైన పనులను ప్రధానోపాధ్యాయులు వేగిరం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. హెచఎం మొబైల్‌ యాప్‌లో పనుల పురోగతిని అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ నెల 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్న పాఠశాలల తాళాలను ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్‌కుమార్‌, హెచఎంలు, కాంప్లెక్స్‌ హెచఎంలు, నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:04 AM

Advertising
Advertising