ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి విధుల్లోకి నూతన పంతుళ్లు

ABN, Publish Date - Oct 16 , 2024 | 12:41 AM

డీఎస్సీ 2024లో ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయు లు నేడు విధుల్లో చేరనున్నారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో నూతన ఉపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖ అధికారులు పోస్టింగ్‌లు కేటాయించారు. ఖాళీ పోస్టుల జాబితా ఆధారంగా నూతన ఉపాధ్యాయులు ఆప్షన్‌ మేరకు పాఠశాలలను కేటాయించారు. ఈమేరకు కేటాయింపు పత్రాలను డీఈవో కె.సత్యనారాయణ అందజేసి అభినందించారు.

కౌన్సెలింగ్‌ ద్వారా కేటాయింపు పూర్తి

కౌన్సెలింగ్‌లో తడబాటుతో ఆందోళనకు గురైన నూతన ఉపాధ్యాయులు

భువనగిరి టౌన్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ 2024లో ఉద్యోగాలు సాధించిన నూతన ఉపాధ్యాయు లు నేడు విధుల్లో చేరనున్నారు. మంగళవారం భువనగిరిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో నూతన ఉపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖ అధికారులు పోస్టింగ్‌లు కేటాయించారు. ఖాళీ పోస్టుల జాబితా ఆధారంగా నూతన ఉపాధ్యాయులు ఆప్షన్‌ మేరకు పాఠశాలలను కేటాయించారు. ఈమేరకు కేటాయింపు పత్రాలను డీఈవో కె.సత్యనారాయణ అందజేసి అభినందించారు. అయితే 252 మంది ఉపాధ్యాయులకు గాను 250 మంది హాజరు కాగా, మిగతా ఇద్దరు గైర్హాజరు కావడంతో ఆ ఇద్దరికి కూడా అందరి సమక్షంలో పోస్టులను కేటాయించినట్లు తెలిసింది. నూతన ఉపాధ్యాయుల పోస్టుల కేటాయింపు పూర్తికావడంతో బుధవారం రిపోర్ట్‌ చేసి విధుల్లో చేరాలని అధికారులు సూచించారు.

కౌన్సెలింగ్‌లో తడబాటుతో..

షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం ఉదయం 10గంటలకు భువనగిరి పట్టణ శివారులోని వెన్నెల కళాశాలల పోస్టుల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు నూతన ఉపాధ్యాయులకు సోమవార మే సమాచారమిచ్చారు. దీంతో నిర్ధేశిత సమయానికి నూతన ఉపాధ్యాయులు కౌన్సిలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.కానీ సాంకేతిక కారణాలతో కౌన్సిలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారు లు జిల్లా అధికారులకు మంగళవారం ఉదయం సమాచారమిచ్చారు. దీంతో కౌన్సెలింగ్‌ కోసం ఉదయమే వచ్చి న నూతన ఉపాధ్యాయులకు జిల్లా అధికారులు కౌన్సిలింగ్‌ వాయిదా పడినట్లు, నూతన తేదీలను త్వరలో తెలియజేస్తామని తెలిపారు. దీంతో నూతన ఉపాధ్యాయులు ఆందోళనతో కౌన్సెలింగ్‌ కేంద్రంనుంచి వెనుదిరిగారు. కానీ కౌన్సిలింగ్‌ను యథావిధిగా నిర్వహించాలం టూ మధ్యాహ్నం హైదరాబాద్‌నుంచి జిల్లా అధికారుల కు ఆదేశాలొచ్చాయి. దీంతో జిల్లా విద్యా శాఖ అధికారు లు హడావుడిగా ఫోన్ల ద్వారా కౌన్సెలింగ్‌కు వెంటనే హాజరుకావాలంటూ నూతన ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయులు హుటాహుటిన తిరిగి రావడంతో మధ్యాహ్నం ప్రారంభమైన కౌన్సిలింగ్‌ రాత్రి 10గంటల వరకు కొనసాగింది.

Updated Date - Oct 16 , 2024 | 12:41 AM