మూసీ ప్రక్షాళనను ఎవరూ ఆపలేరు: సామేల్
ABN, Publish Date - Oct 26 , 2024 | 12:33 AM
బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీ్‌షరావులే కాదు వారి తాతలు దిగొచ్చి, అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పష్టం చేశారు.
మోత్కూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీ్‌షరావులే కాదు వారి తాతలు దిగొచ్చి, అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన చేయాలన్న డిమాండ్‌తో యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం మానాయకుంట- గురిజాల మధ్య ఉన్న మూసీ బ్రిడ్జి వద్ద ఈ నెల 27న నిర్వహించే బహిరంగ సభకు స్థలాన్ని శుక్రవారం పరిశీలించి, విలేకరులతో మాట్లాడారు. తన చిన్నతనంలో మూసీ నీటిని తాగేవారమన్నారు. అలాంటి నీరు ఇప్పుడు కలుషితమై, ఆ నీటితో పండించిన పంటలు తినలేని దుస్థితి ఏర్పడిందన్నారు. మూసీ ప్రక్షాళన వద్దనే బీఆర్‌ఎస్ నాయకులు వారి ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళనకు రూ.25వేల కోట్లు కేటాయించి, మూసీ రివర్ ప్రాజెక్టును ఏర్పాటుచేసి దానికి సుధీర్‌రెడ్డి చైర్మనగా ఎందుకు చేశారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కోసం ఈ నెల 27న మానాయకుంట బ్రిడ్జి వద్ద 10వేల మందితో సభ నిర్వహిస్తున్నామని, మోత్కూరు, అడ్డగూడూరు, శాలిగౌరారం మండలాల నుంచి ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. తనతో పాటు భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభకు జిల్లా మంత్రులను, మూసీ పరివాహక ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తామన్నారు. అడ్డగూడూరు, తుంగతుర్తి మండలాలకు ఐటీఐ కళాశాలలు మంజూరయ్యాయన్నారు. సమావే శంలో అడ్డగూడూరు, మోత్కూరు సింగిల్‌విండోల చైర్మన్లు కొప్పుల నిరంజనరెడ్డి, పేలపూడి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొలెబోయిన లింగయ్య యాదవ్, వం గాల సత్యనారాయణ, సమరంరెడ్డి, నాయకులు ఇటికాల చిరంజీవి, అన్నెబోయిన సుధాకర్, చామల అనిల్‌రెడ్డి, పైళ్ల సోమిరెడ్డి, సత్యనారాయణ, వేణుగోపాల్‌రెడ్డి, జోజి ఉన్నారు.
మోత్కూరుకు నిధులు మంజూరు చేయిస్తా
మోత్కూరు మునిసిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం త్వరలోనే మరో రూ.10 కోట్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే సామేల్ హామీ ఇచ్చారు. కార్యాలయంలో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లా డారు. ఇప్పటికే మంజూరైన పనులు, మెయినరోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కమిషనర్ సి.శ్రీకాంత, వైస్‌చైర్మన బొల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన సభ్యులు పాల్గొన్నారు.
సన్నాలకు రూ.500 ప్రభుత్వ బోనస్
మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో సింగిల్ విండో ఆధ్యర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సామేల్ ప్రారంభించారు. సన్న ధాన్యానికి ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన పేలపూడి వెంకటేశ్వర్లు, సంఘం సీఈవో కె.వరలక్ష్మీ, మార్కెట్ కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, నాయకులు గుండగోని రామచంద్రు, పైళ్ల సోమిరెడ్డి, అవిశెటిట అవిలిమల్లు, కోమటి మత్స్యగిరి, అన్నెపు పద్మ, కుర్మిళ్ల ప్రమీల పాల్గొన్నారు.
Updated Date - Oct 26 , 2024 | 12:33 AM