ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓపెనగా చదివింపులు

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:21 AM

వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు తిరిగి కొనసాగించేందుకు ఓపెన టెన్త, ఇంటర్‌ ద్వారా ప్రభుత్వం వీలుకల్పించింది.

సూర్యాపేటలో ఓపెన తరగతులను బోధిస్తున్న ఉపాధ్యాయుడు(ఫైల్‌)

వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు తిరిగి కొనసాగించేందుకు ఓపెన టెన్త, ఇంటర్‌ ద్వారా ప్రభుత్వం వీలుకల్పించింది. తక్కువ ఫీజుతో పదో తరగతి పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా పదో తరగతి పాస్‌అయిన వారు ఇంటర్‌ పరీక్షకు అర్హతగా పేర్కొంది. అయితే ఏర్పాటుచేసిన కేంద్రాల్లోని ఇనచార్జిలు, సహయకులకు ఇది కల్పతరువుగా మారింది. పరీక్ష సమయాల్లో తాము చూసుకుంటామని, పరీక్ష రాయకున్నా పాస్‌ చేస్తామంటూ వసూళ్లకు దిగుతున్నారు.

- (ఆంధ్రజ్యోతి-భానుపురి)

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓపెన పది, ఇంటర్‌ కలిపి మొత్తం 105 కేంద్రాలున్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 29 పదో తరగతి కేంద్రాలు కాగా 27 ఇం టర్‌ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో టెన్త 16, ఇంటర్‌ 21, యాదాద్రిభువనగిరిలో టెన్త 8, ఇంటర్‌ 4 కేంద్రాలు ఉన్నాయి. అడ్మిషన్లకు అక్టోబ రు 31 చివరి తేదీ కాగా ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నారు. పదో తరగతికి 1,558, ఇంటర్‌కు 2,808 అడ్మిషన్లు వచ్చాయి. అత్యధికంగా యా దాద్రిభువగిరిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని సెంటర్‌కు 400 అడ్మిషన్లు రాగా మిగతా ఒక్కో సెంటర్‌లో 80 వరకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పదో తరగతికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ప్రవేశ ఫీజు రూ.1400,ఆనలైనలో వనటైన రిజిస్ట్రేటషన చేయడానికి రూ.185, ఓసీలకు రూ. 1800,ఆనలైన చేయడానికి రూ.185, అదే ఇంటర్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 1700,వనటైమ్‌ రిజిస్ట్రేషనకు రూ.385, ఓసీలకు రూ.2100 చెల్లించాల్సి ఉంటుంది.

30 వారాలు తరగతులు

ఓపెన టెన్త, ఇంటర్‌లలో అడ్మిషన పొందిన వారికి ప్రతీ ఆదివారం తరగతుల ను తీసుకుంటారు. 30వారాల పాటు వారు తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షలకు రాయాల్సి ఉంటుంది. అయితే అడ్మిషన పొందిన వారికి ఇంతవరకు పుస్తకాలు ఇవ్వకపోగా, తరగతులు ప్రారంభించలేదు. ఇదిలా ఉంటే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్‌గా చదివి పాసైనవారు పొందిన సర్టిఫికెట్లతో సమానంగా గుర్తింపు ఉంటుంది. ఇంత ప్రాధాన్యం కలిగి ఉండటంతో ఓపెన అభ్యర్థులను పాస్‌ చేయిస్తామంటూ కేంద్రాల నిర్వాహకులు ఇప్పటినుంచే గాలం వేయడం ప్రారంభించారు. ఇప్పటికే పలు పనుల్లో నిమగ్నమై చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టలేని వారు వీరి మాటలకు తలొగ్గి కొంత డబ్బును వదులుకుంటున్నట్లు సమాచారం.

పాస్‌ చేయిస్తామంటూ..

సూర్యాపేటలో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓపెన టెన్త, ఇంటర్‌ కేంద్రాలున్నాయి.

అయితే ఇంటర్‌ కోసం ఓ కేంద్రంలో నెల కిందట అడ్మిషన తీసుకోగా అతడి నుంచి నిర్వాహకులు రూ.3,700 ఫోన పే ద్వారా తీసుకున్నారు. పరీక్ష సెంటర్‌ను మేనేజ్‌ చేస్తానని, చదవకున్నా పాస్‌ చేయిస్తానని మాటలు చెప్పి దావత ఇప్పించుకున్నారు. దీనికి తోడు చేబదులు రూ.5 వేలు ఇవ్వాలని, మరోసారి రూ.15,000 ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. అయితే అడ్మిషన పొందిన వ్యక్తి తన వద్ద డబ్బులు లేవని బదులిచ్చాడు. ఈ ఉదంతం నిర్వాహకులు అడ్మిషన పొందిన వారిని ఎలా మభ్యపెడుతున్నారో తెలుస్తోంది. మరికొన్నిచోట్ల కొంతమంది దళారీలను నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజునే తీసుకోవాలి

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే తీసుకోవాలి. అదనంగా తీసుకుంటున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా మాయమాటలతో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. కొన్ని పాతపుస్తకాలు ఉన్నాయి. మరికొన్ని కొత్తపుస్తకాలు రావాల్సి ఉంది. త్వరలోనే తరగతులను ప్రారంభిస్తాం. ఈ నెల 18 తర్వాత ఆడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది.

ఫసత్తెమ్మ, ఓపెన టెన్త, ఇంటర్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారి

Updated Date - Nov 14 , 2024 | 12:21 AM