ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN, Publish Date - Dec 17 , 2024 | 12:35 AM

చౌటుప్పల్‌ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌( సీహెచసీ)లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు కోరారు.

ఆలస్యంగా వచ్చిన వైద్యుడిని ప్రశ్నిస్తున్న మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు

చౌటుప్పల్‌ టౌన, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌( సీహెచసీ)లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు కోరారు. సోమవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను చైర్మన రాజు అకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యుల్లో నెలకొన్న అభిప్రాయ బేధాలతో రోగులకు సరియైున వైద్య సేవలు అంద డం లేదని అన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించగా, నిర్ణీత సమయానికి ఒక్క వైద్యుడు కూడ రాకపోవడంతో చైర్మన రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10మంది వైద్యులకు వివిధ కారణాలతో ఇద్దరు, ముగ్గురు వైద్యులు మాత్రమే ఆసుపత్రికి రావడం పట్ల చైర్మన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందక పోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లవలసి వస్తోందని రోగుల తెలిపారు. ఈ సమస్య ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ద్వారా రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ దృష్టికి తీసుకువెలతామని ఆయన తెలిపారు. చైర్మన వెంట కౌన్సిలర్‌ ఎండి. బాబా షరీప్‌ ఉన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 12:35 AM