వివాదాలను పరిష్కరించుకుంటే మానసిక ప్రశాంతత
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:43 AM
కోర్టు వివాదాలను పరిష్కరించుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు వాయిదాల నుంచి విముక్తి లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించి న జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు
భువనగిరి టౌన్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కోర్టు వివాదాలను పరిష్కరించుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు వాయిదాల నుంచి విముక్తి లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి జయరాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించి న జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేసులో రాజీ పడడాన్ని గౌరవంగా పరిగణించాలని, లోక్ అదాలత్ పరిష్కారంలో ఇరుపక్షాలు గెలిచినట్లేనని అన్నారు. ప్రతి మూడు నెలలకు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండు కేసుల్లో బాధితులకు రూ.18లక్షల నష్టపరిహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవిలత, న్యాయమూర్తులు ఉషా శ్రీ, జి.కవిత, అదనపు డీసీపీ సీహెచ్.లక్ష్మీనారాయణ, బార్ అ సోసియేషన్ అధ్యక్షుడు బి.హరినాధ్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 5,582 కేసుల పరిష్కారం
జిల్లాలోని ఎనిమిది కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 5,582 కేసులు పరిష్కారమయ్యాయని న్యాయ శా ఖ అధికారులు తెలిపారు. 8 సివిల్ కేసులు, 56 పీఎల్‌సీ కేసు లు, 2,128 క్రిమినల్ కేసులు, 3,390 ఈ-చలానా కేసులు పరిష్కారమైనట్టు అధికారులు తెలిపారు.
రాజీమార్గమే రాజమార్గం
(ఆంధ్రజ్యోతి, చౌటుప్పల్ టౌన్): రాజీమార్గమే రాజమార్గమ ని చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మహతి వైష్ణవి అన్నారు. స్థానిక కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,319 కేసులను రాజీమార్గంలో పరిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తాడూరి పరమేష్, కోర్టు సూపరిండెంట్ నరేష్, పీపీ ఖాజా నిజాముద్దీన్, ఏజీపీ మక్తాల నరసింహ, న్యాయవాదులు ఎ.స్వాతి, జి.రవీందర్, చామట్ల జంగయ్య, డి.శ్రీశైలం, ఎండి.ఖయ్యూమ్ పాషా, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, 1,319 కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించి జిల్లాలో చౌటుప్పల్ ప్రథమ స్థానంలో నిలిచింది.
320 కేసుల పరిష్కారం
(ఆంధ్రజ్యోతి, రామన్నపేట): రామన్నపేటలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 320కేసులు పరిష్కారమైనట్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి.మాజీద్, జినుకల ప్రభాకర్, ఉయ్యాల హనుమంతుగౌడ్,లింగయ్య, సత్తయ్య, మామిడి వెంకటరెడ్డి, శ్రవణ్‌కుమా ర్, బర్ల డెవిడ్, నకిరెకంటి మొగులయ్య, యాదాసు యాదయ్య, రమేష్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పి.మల్లయ్య, కోర్టు సూపరింటెండెంట్లు నారగోని గంగాభవాని, శివరాజు పాల్గొన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 12:43 AM