ప్రజల కష్టాలు తీర్చాలి : సీపీఎం
ABN, Publish Date - Nov 07 , 2024 | 12:17 AM
మూసీ నది వెంట సీఎం రేవంత రెడ్డి పాదయాత్ర చేయడమే కాకుండా మూసీ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ డిమాండ్ చేశారు.
చౌటుప్పల్ రూరల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మూసీ నది వెంట సీఎం రేవంత రెడ్డి పాదయాత్ర చేయడమే కాకుండా మూసీ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండల సీపీఎం 8వ మహాసభ బుధవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత రెడ్డి జిల్లా రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మూసీలోకి గోదావరి జలాలను మళ్లించాలని కోరారు. పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మండల కార్యదర్శిని ఎన్నుకున్నారు. రెండో సారి గంగాదేవి సైదులు మండల కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 22మంది కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, కొండమడుగు నర్సింహ, నాయకులు నర్సిరెడ్డి, ఎండి పాషా, కృష్ణారెడ్డి, రాయిని కిష్టయ్య, గుండెబోయిన సబిత, మోహన, చీర్క సంజీవరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Nov 07 , 2024 | 12:17 AM