ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యాసంగి సాగుకు సన్నాహాలు

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:28 AM

యాసంగిలో పంటల సాగుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలతో సన్నద్ధమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కొంత మేర పెరిగాయి.

3.19లక్షల ఎకరాలు అంచనా

పంటల సాగుపై ముందస్తు ప్రణాళిక

మండలాల వారీగా రూపొందించిన వ్యవసాయశాఖ

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి):యాసంగిలో పంటల సాగుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలతో సన్నద్ధమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కొంత మేర పెరిగాయి. దీంతో ఈ సారి యాసంగి సాగు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు మండలాల వారీగా వ్యవసాయశాఖ ప్రణాళికలను సిద్ధం చే స్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ఊపందుకున్నాయి. మరో 15రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కానున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకువస్తున్నారు. ఈ కొనుగోళ్లు పూర్తయిన వెంటనే యా సంగి పంటలపై రైతులు దృష్టి సారించనున్నా రు. ఈ నేపథ్యంలో పంటల సాగుపై ముందస్తు కా ర్యాచరణ ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది.

జిల్లాలో 17 మండలాల్లోనూ వరితో పాటు పలు రకాలు పంటలు సాగు చేస్తారు. యాసంగిలో జిల్లాలో మొత్తం 3,19,320 ఎకరాల్లో పలు పంటలను సాగు చేయనున్నట్టు వ్యవసాయశాఖ అంచనా రూపొందించింది. ఈ మేరకు మండలాల వారీగా ఏ పంటలు సాగు చేసే పరిస్థితి ఉందని అధికారులు పరిశీలించారు. సాగునీటి ప్రాజెక్టుల కింద సాగు లేకపోవడంతో ఆరుతడి పంటలకు రైతులు అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. జిల్లాలో 2,98,000 ఎకరాల్లో వరి, 65 ఎకరాల్లో మిల్లెట్స్‌, 31 ఎకరాల్లో పప్పులు, 55 ఎకరాల్లో నూనె గింజలు, 21,150 ఎకరాల్లో కంది, పెసర్లు, జొన్న, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో వరి కోతలు పూర్తయి, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు ఊపందుకున్నాయి. కోతలు పూర్తికావడంతో యాసంగి పంటకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. మరో వారం రోజుల్లోగా పొలాల దుక్కులు దున్నడం ప్రారంభించనున్నారు. ఈ మేరకు రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో యాసంగిలో వరి పంటకు బదులు మినుము, పెసర, నువ్వులు, పొద్దు తిరుగుడు, వేరుశనగ, శనగలు తదితర ఆరుతడి పంటలు సాగు చేయాల్సిందిగా సూచిస్తూ అధికారులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ప్రత్యేకంగా అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు.

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

జిల్లాలో మొత్తం యాసంగిలో 3.19లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు వ్యవసాయశాఖ అంచనాలు రూపొందించింది. ఈ నేపథ్యంలో సాగుకు సరిపడా విత్తనాలను అందుబాటలో ఉంచేందుకు చర్య లు తీసుకుంటోంది. జిల్లాలో యాసంగిలో మొత్తం 74,500 క్వింటాళ్ల వరి విత్తనాలు, 5.20 క్వింటాళ్ల మిల్లెట్స్‌, 2క్వింటాళ్ల పప్పులు, 28క్వింటాళ్ల నూనె గింజల విత్తనాల స్టాక్‌ను రైతులకు అందుబాటలో ఉంచేందుకు వ్యవసాయశాఖ నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 57,816మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేసింది. వీటిలో యూరియా 25,282 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 10,419 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 4,167 మెట్రిక్‌ టన్నులు, కాంప్లె ఎరువులు 16,670 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎ్‌సపీ 1,278 మెట్రిక్‌ టన్నుల వరకు రైతులకు అందుబాటులో ఉంచనుంది.

3.19లక్షల ఎకరాల్లో సాగు అంచనా : గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

యాసంగిలో జిల్లాలోని 17 మండలాల్లో 3.19లక్షల ఎకరాల్లో పలు రకాల పంట లు సాగుచేసేందుకు అంచనాలు రూ పొందించాం. మరో 15 రోజుల్లోగా యాసంగి సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు మండలాల వారీగా ఏ పంటలు సాగు చేసే అవకాశం ఉందనే వివరాలు సేకరించాం. యాసంగిలో వరి అధిక శాతం జిల్లా రైతులు సాగుచేస్తారు. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో పర్యటించి, రైతు వేదికల ద్వారా రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Nov 12 , 2024 | 12:28 AM