ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Oct 16 , 2024 | 12:39 AM
వా నాకాలం 2024-25కు సంబంధించి సన్న, దొడ్డురకం వరి ధాన్యం కొనుగోలును సక్రమంగా నిర్వహించాలని కలెక్ట ర్ హనుమంతు కే.జెండగే సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి ధాన్యం కొనుగోలుపై మంగళవా రం అవగాహన సమావేశం నిర్వహించారు.
369 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యం
సన్న రకానికి రూ.500 బోనస్
కలెక్టర్ హనుమంతు కే.జెండగే
భువనగిరి కలెక్టరేట్, అక్టోబరు15 (ఆంధ్రజ్యోతి): వా నాకాలం 2024-25కు సంబంధించి సన్న, దొడ్డురకం వరి ధాన్యం కొనుగోలును సక్రమంగా నిర్వహించాలని కలెక్ట ర్ హనుమంతు కే.జెండగే సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి ధాన్యం కొనుగోలుపై మంగళవా రం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దొడ్డురకానికి సం బంధించి 322 కొనుగోలు కేంద్రాలు, 47 సన్న రకం కొనుగోలు కేంద్రాలు మొత్తం 369 కొనుగోలు కేంద్రాల్లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారిగా సన్నరకం ధాన్యానికి రూ.500 బోన్‌సతోపాటు గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాకు మద్దతు ధర రూ.2320, సాధారణ రకానికి రూ.2300 మద్దతు ధర ప్రకటించిందన్నారు. రైతులు శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తే వాలని, ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లోనే రైతుల కు చెల్లింపులు జరుగుతాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డురకానికి వేర్వేరుగా రికార్డులు నిర్వహించి మూమెంట్ రిజిస్టర్‌ను వేరుగా నిర్వహించాలన్నారు. రిజిస్టర్లలో రైతు పేరు, ఫోన్‌నెంబర్, సమయం, స్థలం, రైతు సంతకం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీటి వసతి సౌక ర్యం కల్పించి వర్షాలపై అప్రమత్తం, అవగాహన కల్పిం చి ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ ధాన్యం బస్తాపై నెంబర్ వేయాలని, దొడ్డు, సన్న రకాల కేంద్రాలను ఏఈవోలు సందర్శించాలన్నారు. ధాన్యం తేమ కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచి, రెండు రకాల ధాన్యం తరలింపునకు వేర్వేరుగా రవాణా చేయాలన్నారు. సన్నబియ్యం కొనుగోలు ను వేగవంతంచేసి, ఓపీఎంఎ్‌సలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. వానాకాలం పంట కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి ఏ కేంద్రంలోనైనా రూ.500 బోన్‌సపై అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, చెక్‌పోస్టు లు, టోకెన్ల జారీ, ప్యాడీ క్లీనర్లు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలులో ఏమైనా సమస్యలుంటే, రైతులు టోల్ ఫ్రీ సెల్:7995120554కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, ఆర్డీవో అమరేందర్, డీసీఎ్‌సవో వనజాత, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సామ జగదీశ్ కుమార్, డీపీఎం సునీల్ రెడ్డి తదితరులున్నారు.
Updated Date - Oct 16 , 2024 | 12:39 AM