ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పత్తి కొనుగోలు వెంటనే చేపట్టాలి

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:47 AM

సీసీఐ నిబంధనలతో జిన్నింగ్‌ మిల్లులు కొనుగోళ్లు నిలిపివేశాయని, వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు.

నీలంనగర్‌ వద్ద రోడ్డుపై పడుకుని రాస్తారోకో చేస్తున్న పత్తి రైతులు

పెద్దఅడిశర్లపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : సీసీఐ నిబంధనలతో జిన్నింగ్‌ మిల్లులు కొనుగోళ్లు నిలిపివేశాయని, వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం నీలంనగర్‌ సమీపంలోని కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం పత్తి రైతులు రోడ్డుపై పడుకుని రాస్తారోకో చేశారు. గంట పాటు జరిగిన ఆందోళనతో కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. సీసీఐ ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 పేరుతో బిల్లులో కఠిన నిబంధనలు అమలు చేయడాన్ని నిరసిస్తూ జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ అసోసియేషన ఆదేశాల మేరకు పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి నిరవధికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెద్దఅడిశర్లపల్లి మండలంలోని రెండు కొనుగోలు కేంద్రాలకు తాళం వేశారు. సీసీఐ నిబంధనలను పునఃపరిశీలించి సమస్యలు పరిష్కరించే వరకు కొనుగోళ్లను నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అసోసియేషన నిర్ణయంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన ఆరంభంలో వర్షాబావం, తర్వాత భారీ వర్షాలతో పత్తి చేలు జాలు పట్టిపోయిందన్నారు. తెగుళ్లు, చీడపీడల బెడదతో ఉండడంతో దిగుబడి ఎకరానికి 10-12 క్వింటాళ్లకు గాను కేవలం ఐదారు క్వింటాళ్లు మాత్రమే వచ్చిందన్నారు. దిగుబడి తగ్గి ఆందోళన ఉన్న తమకు కొనుగోలుదారుల బంద్‌తో మూలిగే నక్క మీద తాటికియ పడినట్లయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగు రోజులుగా పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని వెంటనే ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాస్తారోకో చేస్తున్న రైతులపై ఓ కానిస్టేబుల్‌ పరుషపదజాలం వాడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే ఇనచార్జి ఎస్‌ఐ రాజు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేయగా వారు వినలేదు. కానిస్టేబుల్‌పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలపడంతో రైతులు శాంతించి రాస్తారోకోను విరమించారు.

కొండమల్లేపల్లిలోనూ ఆందోళన

కొండమల్లేపల్లి : సీసీఐ నిబంధనలకు నిరసనగా జిన్నింగ్‌ మిల్‌ యజమానులు కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి సమీపంలో కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై పత్తి ట్రాక్టర్‌ను అడ్డంగా పెట్టి రైతులు రాస్తారోకో దిగారు. కొనుగోలు కేంద్రాల మూసివేతతో రోజుల తరబడి కేంద్రాల వద్దనే ఉంటుండడంతో ట్రాక్టర్లకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోయారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు రైతులు సర్ధిచెప్పి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు కొర్ర స్వామి, మెగావత హరిలాల్‌, పగడాల బాలయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:47 AM