ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:56 AM

ప్రజలందరికీ ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన నర్సింగ్‌, పారామెడికల్‌ కళాశాలను, జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్‌ మైత్రి క్లినిక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.

అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రభుత్వ విప్‌ అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం

భువనగిరి టౌన్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరికీ ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన నర్సింగ్‌, పారామెడికల్‌ కళాశాలను, జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్‌ మైత్రి క్లినిక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం వర్చువల్‌ విధానంలో ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికంగా జరిగిన సమావేశంలో ఇరువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం పెంచుతూ, నాణ్యమైన వైద్య సేవలందించే లక్ష్యంతో తొలి ఏడాదిలో ఆరోగ్య శాఖలో 7,774 పోస్టులను భర్తి చేసినట్లు రాష్ట్రవ్యాప్తంగా 28 పారా మెడికల్‌, 16 నర్సింగ్‌ కళాశాలలు, 32 ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌లను ఏకకాలంలో సీఎం వర్చువ ల్‌ విధానంలో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలెవ్వ రూ అప్పులపాలు కావద్దనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచినట్లు తెలిపారు. భువనగిరి వైద్య కళాశాల 50సీట్లు, నర్సింగ్‌ కళాశాలల 60సీట్లతో ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయని, దీంతో జిల్లా విద్యార్థులకు స్థానికంగానే వైద్య కోర్సులు చదివే అవకాశాలు మెరుగయ్యాయన్నారు. మైత్రి క్లినిక్‌లో ఇకనుంచి ట్రాన్స్‌జెండర్లు గౌరవంతో కూడిన వైద్య సేవలను పొందవచ్చన్నారు. అనంతరం నర్సింగ్‌ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాను హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ గంగాధర్‌, డీసీపీ ఎం.రాజే్‌షచంద్ర, మునిసిపల్‌ చైర్మన్‌ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో మనోహర్‌, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ చిన్నా నాయక్‌, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రమే్‌షరెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎండీ అవేజ్‌ చిస్తీ, నర్సింహరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:56 AM