బీవెల్లెంల రిజర్వాయర్‌లోకి నీటి విడుదల
ABN, Publish Date - Oct 26 , 2024 | 12:47 AM
మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు రిజర్వాయర్‌లో కి ప్రాజెక్టు అధికారులు శుక్రవారం సాయం త్రం నీటి విడుదలను ప్రారంభించారు.
నార్కట్‌పల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు రిజర్వాయర్‌లో కి ప్రాజెక్టు అధికారులు శుక్రవారం సాయం త్రం నీటి విడుదలను ప్రారంభించారు. గత నెలలో పానగల్ ఉదయసముద్రం రిజర్వాయర్‌లో తగినంత నీటి లభ్యత లేక బ్రాహ్మణ వెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్‌హౌ్‌సలోని మోటర్లు ట్రయల్‌రన్‌కే పరిమితమైంది. ప్రస్తుతం ఉదయసముద్రం రిజర్వాయర్‌లోకి వరద జలాల రాక పెరడగంతో పాటు పాటు భారీ గా కురిసిన వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పలు గ్రామాల చెరువుల్లోకి నీరు కూడా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ సూచనల మేరకు ప్రాజెక్టు అధికారులు బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్‌లోకి నీటి విడుదలను ప్రారంభించారు. రిజర్వాయర్ పూర్థిస్థాయి నీటిమట్టం 0.3 టీఎంసీలు కాగా తొలుత 0.2 టీఎంసీల మేర నింపనున్నారు. ఈ మేరకు రోజూ 2 మోటార్లను పగటిపూటే నడుపుతూ నాలుగు రోజుల్లోగా రిజర్వాయర్‌కు 0.2 టీఎంసీల మేర నీటిని పంపింగ్ చేయ నున్నారు. సోమవారం నుంచి రిజర్వాయర్ కుడి, ఎడమకాల్వల తవ్వకం పనులను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.
Updated Date - Oct 26 , 2024 | 12:47 AM