ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎకరానికి రూ.3కోట్లు ఇవ్వాలి

ABN, Publish Date - Dec 03 , 2024 | 01:00 AM

గౌరెల్లి-భద్రాచలం జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదు లు భూమి ఇవ్వాలని, లేకుంటే ఎకరానికి రూ.3కోట్ల నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని సీపీఎం అనుబంధ సంఘాలైన రైతు సంఘం, వ్య.కా. సం. జిల్లా ప్రధాన కార్యదర్శులు మాటూరి బాలరాజు, కొండమడుగు నర్సింహ డిమాండ్‌చేశారు.

అభివృద్ధి పేరుతో పంట పొలాల సేకరణ తగదు

గౌరెల్లి-భద్రాచలం రోడ్డు బాధితుల ధర్నాలో వ్యకాసం

భువనగిరి అర్బన్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గౌరెల్లి-భద్రాచలం జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదు లు భూమి ఇవ్వాలని, లేకుంటే ఎకరానికి రూ.3కోట్ల నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని సీపీఎం అనుబంధ సంఘాలైన రైతు సంఘం, వ్య.కా. సం. జిల్లా ప్రధాన కార్యదర్శులు మాటూరి బాలరాజు, కొండమడుగు నర్సింహ డిమాండ్‌చేశారు. కలెక్టరేట్‌ వద్ద సోమవారం గౌరెల్లి-భద్రాచ లం జాతీయరహదారిలో భూములు కోల్పోతున్న భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాలతోపాటు భువనగిరి పట్టణ నిర్వాసితులతో చేపట్టి న ధర్నాలో వారు మాట్లాడారు. అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పంట పొలాలు సేకరించి రైతుల నోట్లో మట్టి కొడుతోందన్నారు. భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లో సుమారు 20 గ్రామాల్లో 500 ఎకరాల కు పైగా భూములు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్‌ మార్కెట్‌లో రూ.2కోట్ల నుంచి రూ.3కోట్లు పలుకుతున్న భూములకు రాష్ట్ర ప్రభుత్వ కేవలం రూ.7.5లక్షలు రైతులకు చెల్లించడం దారుణమన్నారు. ఈ ప్రాం తంలో భూములకు ప్రైవేట్‌ ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం మొండితనంతో ముందుకెళ్తే రోడ్డు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో ఈ రహదారి మీదుగా వచ్చిన ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సమస్యను తెలుసుకొని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గూడూరు అంజిరె డ్డి, కోట రామచంద్రారెడ్డి, మంచాల మధు, నిర్వాసితులు అందెల హరీ ష్‌, గూడూరు బుచ్చిరెడ్డి, మల్గ రవీందర్‌, భీమిరెడ్డి, నరేందర్‌రెడ్డి, మా మిళ్ల యాదయ్య, కిష్టయ్య, గాదగోని మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:00 AM