ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధిని పట్టించుకోని పాలకులు

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:32 AM

జిల్లా ఏర్పడి ఎని మిది సంవత్సరాలు గడుస్తున్నా పాలకులు, అధికారుల వైఖరితో అభివృద్ధి లో వెనుకబడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌ అన్నారు.

భువనగిరిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జహంగీర్‌

సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌

భువనగిరి టౌన, గుండాల, అక్టోబరు27(ఆంధ్రజ్యోతి): జిల్లా ఏర్పడి ఎని మిది సంవత్సరాలు గడుస్తున్నా పాలకులు, అధికారుల వైఖరితో అభివృద్ధి లో వెనుకబడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌ అన్నారు. భువనగిరిలో ఆదివారం జరిగిన సీపీఎం పట్టణ 13వ మహాసభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా జిల్లాఅభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. జిల్లాకేంద్రంగాఉన్న భువనగిరి పట్టణంలో మౌలిక వసతులు కొరవడ్డాయన్నారు. పట్టణాల్లో డ్రైనేజీ, తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాకేంద్ర ఆస్పత్రి అభి వృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరక రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, నాయకులు మాయ కృష్ణ, దాసరి పాండు, రాజు, ఈర్ల ముత్యాలు, గందమల్ల మాతయ్య, ఎల్లయ్య, మంజుల పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి

ప్రజాపాలన ద్వారా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పది నెలలు పూర్తయినా ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని సీసీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌ అన్నా రు. గుండాల మండలంలోని పెద్దపడిశాలలో జరిగిన పార్టీ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. సీపీఎం చేపట్టిన పోరాటాల ఫలితంగా స్థానిక ఎమ్మెల్యే నవాబుపేట రిజర్వాయర్‌ నుంచి సాగునీరు విడుదల చేయించారని, నీరు విడుదలై నెల రోజులు గడుస్తున్నా మండలంలో ఒక్క చెరువు కూడా నిండలేదన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వర్గసభ్యుడు మాటూరి బాలరాజు, నాయకులు బొల్లు యాదగిరి, పైల్ల యాదిరెడ్డి, గుండు వెంకటనర్సు, మద్దెపురం రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 12:32 AM