9 నుంచి సదరం శిబిరం
ABN, Publish Date - Sep 06 , 2024 | 12:38 AM
ప్రతీ నెలలో జరిగే సదరం శిబిరం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో టీ.నాగిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
భువనగిరి అర్బన, సెప్టెంబరు 5: ప్రతీ నెలలో జరిగే సదరం శిబిరం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీఆర్డీవో టీ.నాగిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9న రెన్యూవల్, కొత్తగా స్లాట్లు నమోదు చేసుకునేవారు సమీపంలో మీ-సేవ కేంద్రాలను ఉదయం 11గంటలకు సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ నెల 10న వినికిడి లోపం ఉన్నవారికి కొత్తవి 50, రెన్యూవల్ 20, ఆర్థోపెడిక్ (శారీరకలోపం) సంబంధించి 11, 18, 21, 28తేదీల్లో కొత్తవి 50, రెన్యూవల్ 20, మానసిక రుగ్మతకు సంబంధించి 19న కొత్తవి 40, రెన్యూవల్ 10, కంటి లోపం 24న కొత్తవి 30, రెన్యూవల్ 10 స్లాట్ల బుకింగ్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక రోగులు సదరం క్యాంపులో దరఖాస్తులు చేసుకోకూడదని పేర్కొన్నారు. మీ-సేవలో నమోదు చేసుకుని అందుకు సంబంధించిన మెసేజ్ అందిన వారు మాత్రమే జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధార్, రేషన, ఓటర్ కార్డులతో పాటు వైద్యుని రిపోర్టులతో శిబిరంలో పాల్గొనాలని తెలిపారు. వైద్యులు పరీక్షించి వికలత్వ శాతాన్ని నిర్ధారించిన తర్వాత సదరం ధ్రువపత్రం అందజేయనున్నట్లు, అనివార్య కారణాలతో వైద్యుడు అందుబాటులో లేకుంటే క్యాంపు రద్దు చేయనున్నట్లు వెల్లడించారు.
Updated Date - Sep 06 , 2024 | 07:01 AM