ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక సమరానికి సై

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:29 PM

పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడం తో గ్రామాల్లో సందడి నెలకొంది. తొలుత పంచాయతీలు, ఆతర్వాత మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాలకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో ఆశావహుల్లో ఆనందం కనిపిస్తోంది.

గ్రామాల్లో ఆశావహుల సందడి

రిజర్వేషన్ల కోసం ఎదురుచూపు

జనవరిలో షెడ్యూల్‌ వస్తుందనే సమాచారంతో నాయకుల్లో ఉత్సాహం

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడం తో గ్రామాల్లో సందడి నెలకొంది. తొలుత పంచాయతీలు, ఆతర్వాత మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాలకు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో ఆశావహుల్లో ఆనందం కనిపిస్తోంది. పది నెలలు గా పంచాయతీలకు, ఆరు నెలలుగా పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లింది.

పంచాయతీల పాలకవర్గాల గడువు తీరడం తో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చే నిధులు నిలిచాయి. పాలకవర్గాలు ఉంటేనే కేంద్రం నిధులను విడుదల చేస్తుంది. దీంతో ప్రస్తుతం పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేం ద్రంనుంచి నిధుల విడుదలకు బ్రేకులు పడ్డాయి. జనవరిలో సంక్రాంతి పర్వదినం తరువాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలచేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండడం తో ఆశావహులు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లా పరిషత్‌లు, 73 జడ్పీటీసీ స్థానాలు, 73 మండల పరిషత్‌లు,1,740గ్రామపంచాయతీలు ఉన్నాయి. తొలుత పం చాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజకీయ సందడి మొదలైంది.

రిజర్వేషన్లపై ఉత్కంఠ

బీసీలకు రిజర్వేషన్‌ పెంచుతామని శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించకూడదు. దీంతో బీసీ రిజర్వేషన్లను తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్‌ డిసెంబరు 10వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక వచ్చాక బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తేలనుంది. దీని ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెం చి ఎన్నికలు నిర్వహిస్తారా? లేక సుప్రీం కోర్టు నిబంధనలకు కట్టుబడి అధికారికంగా 50శాతం లోపు రిజర్వేషన్లు ప్రకటించి, పార్టీ నుం చి మాత్రం బీసీలకు ఆ కమిషన్‌ నిర్దేశిత కోటామేరకు రిజర్వేషన్లు కల్పిస్తారా? అనే విషయం తేలా ల్సి ఉంది. డిసెంబరు నెలాఖరులోగా రిజర్వేషన్లపై తేల్చి, సం క్రాంతి నాటికి ఎన్నికల షెడ్యూ ల్‌ ప్రకటిస్తారనే చర్చ సాగుతోం ది. రిజర్వేషన్ల అంశం తేలితేతప్ప పంచాయతీల ఎన్నికలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

రంగం సిద్ధం చేసుకుంటున్న ఔత్సాహికులు

గ్రామపంచాయతీ సర్పంచ్‌లుగా పోటీచేసేందుకు పలువురు ఔత్సాహిక నాయకులు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఆశావహులు పెళ్లిళ్లకు, చావులకు విధిగా హాజరవుతున్నారు. అదేవిధంగా యువతకు స్పోర్ట్స్‌ కిట్స్‌, క్రికెట్‌ కిట్స్‌ అందిస్తున్నారు. ట్రస్టు లు, సేవాసంస్థల ద్వారా కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను తీసుకువచ్చిన ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌ పదవికి పోటీచేయాలని భావిస్తున్న నాయకులు వినాయకచవితి నుంచే ఖర్చును ప్రారంభించారు. గణపతి మండపాల ఏర్పాటుకు, వినాయక విగ్రహాలకు, అన్నదానాలకు ఆర్థికంగా సాయం చేశారు. ఎవరైనా మృతిచెందితే వారి కుటుంబాలను పరామర్శించడంతోపాటు తోచిన రీతిలో ఆర్థిక సాయంచేస్తూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలను తీసుకెళ్తూ వారిని సంతృప్తి పరుస్తున్నారు. తెల్లచొక్కా, తెల్లప్యాంటు వేసుకొని గ్రామంలో తిరుగుతూ కనబడ్డవారికి నమస్కరిస్తూ కుశల ప్రశ్నలు వేస్తున్నారు. కార్యాలయాల్లో పనులను దగ్గరుండి చేయించిపెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఔత్సాహికులు యువతకు పార్టీలిస్తుంటే, కొన్నిచోట్ల నాయకులు మహిళలకు కోలాటాలు, భజన కార్యక్రమాలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలా ఎక్కడ అవకాశముంటే అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం జనంలో ఉండేలా చూసుకుంటున్నారు. శివ, దత్తాత్రేయ అయ్యప్ప దీక్షలు స్వీకరించిన భక్తులకు అన్నప్రసాదాలు, భజనలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాలయాలు నిర్మిస్తుంటే భూరి విరాళాలు అందజేస్తున్నారు.

రంగంలో నిలిచేందుకు పోటాపోటీ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరడంతో పదేళ్లపాటు స్థానిక సంస్థల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయిన ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులు ఈసారి ఎలాగైనా సర్పంచ్‌గా, ఎంపీపీగా, జడ్పీటీసీ సభ్యుడిగా గెలవాలనే సంకల్పంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకోసం శ్రమించిన కార్యకర్తలు స్థానిక సంస్థల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కీలకనేతల ఆశీస్సులు పొందడం ద్వారా స్థానిక సంస్థల్లో అఽధికార కాంగ్రెస్‌ కండువాతో బరిలో దిగాలనే సంకల్పంతో పలువురు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సలోనూ నాయకులు పట్టువదలకుండా గ్రామాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బలమైన పోటీ ఇస్తామని, పార్టీ అండగా నిలిస్తే ఎంతవరకైనా పోరాడతామని నేతలను కోరుతున్నారు. మరోవైపు బీజేపీ సైతం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ద్వితీయ స్థానానికి రావడంతో ఆ ఊపుని కొనసాగించాలని, గ్రామాల్లోనూ జెండా ఎగరవేయాలని పట్టుదలగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవల సభ్యత్వ నమోదును ఉధృతంగా నిర్వహించారు. మొత్తానికి స్థానిక సమరం మొదలైతే ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఊపందుకోనుంది.

Updated Date - Nov 29 , 2024 | 11:29 PM