ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బునాదిగాని కాల్వకు రూ.266.65కోట్లు మంజూరు

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:47 AM

అసంపూర్తిగా ఉన్న బునాదిగాని కాల్వ నిర్మాణం పూర్తి చేసేందుకు నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా రూ.266.65కోట్లు మంజూరు చేస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. బునాదిగాని కాల్వకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), బీబీనగర్‌, భువనగిరి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మోత్కూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): అసంపూర్తిగా ఉన్న బునాదిగాని కాల్వ నిర్మాణం పూర్తి చేసేందుకు నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా రూ.266.65కోట్లు మంజూరు చేస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. బునాదిగాని కాల్వకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), బీబీనగర్‌, భువనగిరి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2005లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బునాదిగాని కాల్వకు శంకుస్థాపన చేయగా, నేటికీ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నాడు రూ.14.53 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ కాల్వ నిర్మాణం సకాలంలో పూర్తికాకపోవడంతో అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ.71కోట్లు మంజూరవగా, కొంత మేర సాగిన పనులు మళ్లీ నిలిచాయి. ప్రస్తు తం ఆ కాల్వ నిర్మాణం పూర్తి చేసేందుకు అంచనా వ్యయం భారీగా పెరిగింది. గత నెల 30న భువనగిరిలో జరిగిన సాగునీటివనరుల సమీక్షా సమావేశంలో తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు మందుల సామేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బునాదిగాని కాల్వ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా, రూ.269కోట్లు మంజూ రు చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం తాజాగా, రూ.266.65 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి రానున్న వానాకాలం నాటికి కాల్వ పనులు పూర్తిచేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, అదేవిధంగా కాల్వ ద్వారా గోదావరి జలాలు అందించేందుకు బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు అనుసంధానం చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 19 , 2024 | 12:47 AM