ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బడి ఈడు పిల్లలను గుర్తించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Jun 06 , 2024 | 12:24 AM

బడిబాట కార్యక్రమంలో భాగంగా బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అధికారులకు సూచించారు.

భువనగిరి అర్బన, జూన 5: బడిబాట కార్యక్రమంలో భాగంగా బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే బడిబాటలో భాగంగా మండల, గ్రామీణ స్థాయి, అమ్మ ఆదర్శ కమిటీలు సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. అంగనవాడీల నుంచి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలన్నారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులతో కలిసి అర్హత కలిగిన తరగతుల్లో వారిని తిరిగి చేర్పించేలా కృషి చేయాలన్నారు. 6న బడిబాట కార్యక్రమంపై మండల కమిటీల సమావేశం నిర్వహించాలన్నారు. 6 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 7 నుంచి 11గంటల వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. బడిబాట ప్రారంభం రోజు పూర్వ విద్యార్థులతో ప్రమాణాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. 7న ఇంటింటా పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, విద్యార్థుల వివరాలను విలేజ్‌ ఎడ్యుకేషన రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. 8 నుంచి 10వ తేదీ వరకు అంగనవాడీ కేంద్రాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. 11న గ్రామ సభలు, 12న పాఠశాలలను అలంకరించి విద్యార్థులకు స్వాగత దినోత్సవం నిర్వహించాలన్నారు. 13న తరగతుల వారీగా విద్యార్థులు రూపొందించిన పోస్టర్లు, చార్టులతో తరగతి గదులను అలంకరించాలన్నారు. 14న సామూహిక అక్షరభ్యాసం నిర్వహించాలన్నారు. 15న సాహిత్య, విద్య, బాలికల విద్యా దినోత్సవం నిర్వహించాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు. 18న డిజిటల్‌ తరగతులపై అవగాహన కల్పించి విద్యార్థులతో మొక్కలు నాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మాధ్యం, ‘ఇంటింట చదువుల పంట’ యాప్‌పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. 19న క్రీడా దినోత్సవం నిర్వహించి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 08:56 AM

Advertising
Advertising