ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం సారూ..‘గుట్ట’పై దృష్టి సారించరూ..

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:14 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి యాదగిరిగుట్ట పట్టణ, మండల ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు.

యాదగిరిగుట్ట రూరల్‌, నవంబరు 6 (ఆంధ్రజజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి యాదగిరిగుట్ట పట్టణ, మండల ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారు. ఈనెల 8వ తేదీన సీఎం పర్యటన సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు, నాయకులు సమాయ త్తమవుతున్నారు.

మెడికల్‌ కళాశాల ఏర్పాటయ్యేనా?

ప్రధానంగా యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలోని సర్వేనంబరు 64లో 20 ఎకరాల స్థలం మెడికల్‌ కళాశాల నిర్మాణం చేయడానికి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 183కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు కళాశాలకు శంకుస్థాపన చేపట్టలేదు. పైగా 200సీట్లతో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంటే ప్రస్తుతం 50 సీట్లకు కేటాయించి ఆ కళాశాలను జిల్లా కేంద్రం భువనగిరిలో ప్రారంభిస్తున్నారు. వెంటనే కళాశాల పనులు చేపట్టి గుట్టలోనే ఏర్పాలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు దక్కేనా?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ది పనులు మధ్యలో నిలిచిపోవడంతో అభివృద్ధి కుటుపడిందని, యాదాద్రి దేవాలయాల ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా చేపట్టకపోవడంతో ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా పడిపోయిందనే వాదన ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి గుట్ట అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇస్తే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకోవచ్చని పలువురు రియల్టర్లు భావిస్తున్నారు.

భక్తులకోసం ఆసుపత్రి..

గుట్టకు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోడానికి వస్తున్నప్పటికీ కొండపైన సరైన ఆసుపత్రి వైద్యులు లేకపోవడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు భక్తులు ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెంది న సంఘటన సైతం చోటు చేసుకున్నాయి. కొండకింద పీహెచ్‌సీలో పేరుకే 24గంటల ఆసుపత్రి. చుట్టపు చూపుగా వైద్యులు వచ్చి వెళ్తారు తప్ప స్థానికకంగా లేకపోవడంతో భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పలువరు పేర్కొంటున్నారు.

రోడ్డు విస్తరణ బాధితుల పరిస్థితి ఏమిటి?

వైటీడీఏ రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలు, రోడ్లు కోల్పోయిన బాధితులకు స్థానిక బస్టాండ్‌లో ఇళ్లస్థలాల కోసం 139మందికి రెవెన్యూ అధికారులు ప్రోసీడింగ్‌ ఇచ్చారేతప్ప ప్లాట్లు ఇవ్వలేదు. దీంతో బాధితులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానిక సింహద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు నిర్మించిన బ్రిడ్జి వ్యాపారులకు తలనొప్పిగా మారిందని, దానిని తొలగిస్తామని ఇప్పటి వరకు తొలగించలేదని వెంటనే దానిని తొలగించాలని కోరుతున్నారు. 10 సంవత్సరాల క్రితం నిర్మించిన పాతగుట్ట రోడ్డు పూర్తిగా గుంతలు పడిశిథిలం కావడంతో భక్తులు, వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే రోడ్డుకు మరపతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

మెడికల్‌ కళాశాల పనులు ప్రారంభించాలి

మల్లాపురం గ్రామంలోని సర్వేనంబర్‌ 64లోనే మెడికల్‌ కళాశాల పనులను వెంటనే ప్రారంభించాలి. గత ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి వెంటనే పనులను ప్రారంభించాలి.

- కర్రె ప్రవీణ్‌, మల్లాపురం, యాదగిరిగుట్ట మండలం

ఇళ్ల స్థలాల ప్లాట్లు వెంటనే ఇవ్వాలి

యాదగిరిగుట్ట ఆర్టీసీ డీపోలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల ప్లాట్లను వెంటనే కేటాయించాలి. నాలుగు సంవత్సరాలల క్రితం రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్‌ ఇచ్చి ప్లాట్లు ఇవ్వలేదు. మా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేలా అధికారులు కృషి చేయాలి.

- గోర్ల జ్యోతి, రోడ్డు విస్తరణ బాధితురాలు, యాదగిరిగుట్ట

Updated Date - Nov 07 , 2024 | 12:14 AM