ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చింతలపాలెంలో కొత్తగా ఆరు అతిసార కేసులు

ABN, Publish Date - Oct 17 , 2024 | 12:21 AM

చింతలపాలెం మండలకేంద్రంలో బుధవారం మరో ఆరు అతిసార వ్యాధి లక్షణాలు కలిగిన కేసులు నమోదయ్యాయి.

బొడ్రాయిబజార్‌లో పర్యటిస్తున్న డిప్యూటీ డీఎంహెచవో నిరంజన

మేళ్లచెర్వు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): చింతలపాలెం మండలకేంద్రంలో బుధవారం మరో ఆరు అతిసార వ్యాధి లక్షణాలు కలిగిన కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6వ తేదీన బొడ్రాయిబజార్‌లో అతిసార వ్యాధి లక్షణాలను గుర్తించిన వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమతమై ఇంటింటి సర్వే నిర్వహించి, మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. అయితే అదే ప్రాంతంలో బుధవారం ఆరుగురు వ్యక్తులు స్వల్ప అతిసార వ్యాధి లక్షణాలతో బాధపడుతుండటంతో మెరుగైన వైద్యం కోసం కోదాడకు తరలించారు. దీంతో డిప్యూటీ డీఎంహెచవో నిరంజన స్థానిక వైద్యసిబ్బందితో కలిసి కాలనీలో పర్యటించారు. వైద్యశిబిరాన్ని కొనసాగించాలని ఆదేశించారు. క్యాంపులో మండల వైద్యాధికారి సీతామహాలక్ష్మి, వైద్యుడు సచిన, సీహెచవో వినోద్‌, ఆశాలు, ఏఎనఎంలు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 12:21 AM