ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:16 AM

విధుల్లో నిర్లక్ష్యంవహిస్తే వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ మాతృనాయక్‌ అన్నారు. బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులను పరామర్శించి వైద్యం సక్రమంగా అందుతుందా? అని అడిగి తెలుసుకున్నారు. రక్తనిధి కేంద్రాన్ని తనిఖీచేశారు.

ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న మాతృనాయక్‌

దేవరకొండ, సెప్టెంబరు 11: విధుల్లో నిర్లక్ష్యంవహిస్తే వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ మాతృనాయక్‌ అన్నారు. బుధవారం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులను పరామర్శించి వైద్యం సక్రమంగా అందుతుందా? అని అడిగి తెలుసుకున్నారు. రక్తనిధి కేంద్రాన్ని తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి 100 పడకల నుంచి 200 పడకల ఆస్పత్రిగా ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. వంద పడకల ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరుగుతుందని, త్వరలో సూపరింటెండెంట్‌తోపాటు అనస్తీషియా డాక్టర్లు, శస్త్రచికిత్స వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్‌ వ్యాధులు పెరిగిపోతున్నాయని, దీంతో ప్రతీరోజు ప్రభుత్వ ఆస్పత్రికి ఓపీ 700 నుంచి 800వరకు రోగులు వస్తున్నారన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు. ఈ నెల 7న ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవంకోసం వచ్చిన ఇస్లావత్‌ జ్యోతికి మగశిశువు జన్మించాడు. శిశువు అనారోగ్యానికి గురికావడంతో డ్యూటీ డాక్టర్‌ బాబురాం వైద్యపరీక్షలు నిర్వహించడంలో నిర్లక్ష్యం చేశారని, దీంతో శిశువు మృతి చెందాడని జ్యోతి బంధువులు కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్‌ బాబురామ్‌కు మెమో జారీ చేసినట్లు మాతృనాయక్‌ తెలిపారు.

నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు

వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా మాస్‌ మీడియా అధికారి తిరుపతి రెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండలోని న్యూ రెయిన్‌బో ఆస్పత్రిని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ వైద్యులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అదే విధంగా దేవరకొండ పట్టణంలోని పలు ఆస్పత్రులు, ల్యాబ్‌లను తనిఖీ చేశారు.

Updated Date - Sep 12 , 2024 | 12:16 AM

Advertising
Advertising