ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:34 PM

ప్రభుత్వ వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్ట ర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గురుకుల, ప్రభుత్వ వసతి గృహాల వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కలెక్టర్‌ హనుమంతరావు

భువనగిరి అర్బన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్ట ర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గురుకుల, ప్రభుత్వ వసతి గృహాల వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాల వి ద్యార్థులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాలతో ఉండాలన్నారు. నిత్యం వడ్డించే ఆహారం శుచి, శుభ్రత ఉండేవిధంగా వంట సిబ్బంది, వారి సహాయకులు పాటించాలన్నారు. ఎలాం టి అలసత్వం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. వంట చేసేందుకు సేకరించే కూరగాయలు, ఆకుకూరలు, నూ నె,పిండి, పప్పులు తదితర ఆహార పదార్థాలు శుభ్రంగా ఉండే ట్లు చూడాలన్నారు. నిల్వ చేసే కూరగాయలను గాలి, వెలుతు రు ఉండే ప్రాంతంలో భద్రపర్చాలన్నారు. వంట కార్మికులు పరిశ్రభతను పాటించాలన్నారు. వంట చేసే సామగ్రిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ఈగలు, దోమలు, బొద్దింకలు లేకుండా వంట గది, భోజనశాలను శుభ్రం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అన్నం వడ్డించేటప్పుడు తలకు వస్త్రం (టోపి), చే తులకు గ్లౌజులు వేసుకొని కాళ్లు, చేతుల గోళ్లు ఉండకూడదన్నా రు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జి.వీరారెడ్డి, స్థాని క సంస్థల అదనపు కలెక్టర్‌ కే.గంగాధర్‌, జిల్లా వైద్యాధికారి మ నోహర్‌, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోల్‌ అధికారి జ్యోతిర్మయి, ఫుడ్‌ సేఫ్టి అధికారి ఎం.సుమన్‌కల్యాణ్‌, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

‘రైతు పండుగ’కు సీఎం సందేశం

‘రైతు పండుగ’లో భాగంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందేశం ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు తెలిపా రు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ‘రైతు పం డుగ’ కార్యక్రమంలో వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఒక్కొ రైతు వేదికలో 100మంది రైతులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు. దృశ్య, శ్రవణ మాద్యమాల ద్వారా రైతులు వీక్షించేందుకు ఏర్పాటు పూర్తి చేశామన్నారు.

గ్రామీణ పాఠశాలలను దత్తత తీసుకోవాలి

భువనగిరి టౌన్‌: రోటరీ క్లబ్‌ తదితర స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ గ్రామీణ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. రోటరీక్లబ్‌ సభ్యుడు జూలూరు కృష్ణమూర్తి సమకూర్చిన సైకిళ్లను భువనగిరి రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో ఆయన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులను ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో దేశానికి ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. రోటరీక్లబ్‌ జిల్లా గవర్నర్‌ శరత్‌బాబు మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు రోటరీక్లబ్‌ అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌ అన్నారు. 50 మంది బాలికలకు సైకిళ్లను అందజేశారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కరిపే నర్సింగరావు, కె.సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ గవర్నర్‌ ఎస్‌.నర్సింహయాదవ్‌, అసిస్టెంట్‌ గవర్నర్లు శెట్టి బాలయ్యయాదవ్‌, వై.వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:34 PM