ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తులపైనే భారం!

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:59 AM

విశ్వక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వైద్యుడు లేక వైద్యం అందని ద్రాక్షగా మారింది.

- (ఆంధ్రజ్యోతి-భువనగిరి అర్బన)

విశ్వక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో వైద్యుడు లేక వైద్యం అందని ద్రాక్షగా మారింది. అధికసంఖ్యలో క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తుల కోసం రూ.1,200కోట్లతో అభివృద్ధి చేసినప్పటికీ ప్రాణాలు కాపాడే వైద్యుడు లేకపోవడం దురదృష్టకరం. కనీసం వైద్యం అందించేందుకు ఆస్పత్రి భవనం, వైద్యుడు, సరిపడా సిబ్బంది నియమించలేదు. పూర్తిస్థాయి వైద్యుడు లేక దైవదర్శనాలకు వచ్చిన భక్తులకు అత్యవసర సమయంలో చికిత్స అందించేందుకు సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

తొలుత ఆయుర్వేద 1960లో యాదగిరిగుట్టలో వైద్యశాలను ఏర్పర్చగా డాక్టర్‌ యాదగిరిగుప్తా (ఆర్‌ఎంపీ) కొనసాగారు. 1989- 90లో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన అనంతరం 1991లో ఆయుర్వేద వైద్యుడిగా డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను దేవాదాయ శాఖ నియమించింది. అప్పటివరకు ఆయుర్వేద వైద్యమే ఉండగా, యాదగిరికొండపై 1987 నుంచి ఆస్పత్రి ప్రారంభించడంతో డాక్టర్‌ పృథ్వీరాజ్‌ (ఎంబీబీఎస్‌) వైద్యం అందించారు. సుమారు 1990-91 మధ్య అల్లోపతి వైద్యశాలగా విస్తరించి ఒక ఫార్మసిస్ట్‌, ఒక ఎంఎనవోలను నియమించి శ్రీశైలం దేవస్థానం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చిన డాక్టర్‌ పుల్లయ్య (ఎంబీబీఎస్‌) వైదుడిగా కొనసాగారు. 2011లో ఆయన ఉద్యోగ విరమణ అనంతరం సుమారు మరో నాలుగేళ్లపాటు ఔట్‌సోర్సింగ్‌ ప్రతిపాదికన సుమారు 200 ఓపీ రోగులకు సేవలందించేవారు. అప్పట్లో కొండకింద వైకుంఠద్వారం వద్ద ఆస్పత్రి భవనం అందుబాటులో ఉండగా, ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా దాన్ని కూల్చివేశారు. ఆ సమయంలో శ్రీచక్ర భవనం వద్ద ఒక కంటైనర్‌లో వైద్యం అందించగా, అప్పటి నుంచి వైద్యుడిని నియమించకకపోవడంతో ఆయుర్వేద వైద్యుడు ప్రవీణ్‌కుమార్‌ వైద్యం అందించేవారు. ప్రస్తుతం ఆలయ ఉత్తర దిశ ప్రాకార మండపంలో ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ భక్తులకు వైద్య సేవలు అందించడంల లేదు.

యాదగిరికొండకు ఎయిమ్స్‌ వైద్యులు..

ఎయిమ్స్‌ నుంచి వైద్యులు యాదగిరికొండకు రానున్నట్లు ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ వారికోసం ఎదురు చూపులే మిగిలాయి. అత్యవసర సమయంలో భక్తులకు చికిత్స అందించేందుకు కొండపైన బస్టాండ్‌లో (ప్రధాన కార్యాలయం ఎదురుగా) ప్రత్యేకంగా అల్యూమినియంతో గదిని తయారు చేసేందుకు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టగా ఎయిమ్స్‌ వైదులతో వైద్యం అందించాలని ఆలయ అధికారులు సంకల్పించారు. అయినప్పటికీ వైద్యులకు ఇక్కడ ఆస్పత్రి లేక ఇక్కడకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. కాగా, భక్తుల ప్రాణాలు కాపాడేందుకు దేవస్థానం ఆస్పత్రి భవనాన్ని నిర్మించి వైద్యుడిని నియమించక కొండకింద యాదగిరిపల్లిలోని ప్రభుత్వాసుపత్రే భక్తులతోపాటు చుట్టుముట్టు గ్రామస్థులకు దిక్కయ్యింది.

అత్యవసర చికిత్స అవసరం

భక్తులకోసం అత్యవసర చికిత్స అందించే పరిస్థితి ఇక్కడ లేకుండాపోయింది. దేవస్థానం ఆస్పత్రి సుమారు 200 ఓపీ నుంచి రోజురోజుకు అసలు వైద్యుడు లేని స్థితికి దిగజారింది. దీనిపై ఇప్పటి వరకు ఆలయ అధికారులు దృష్టి సారించకపోవడంతో భక్తుల ప్రాణాల మీదకు వస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2024 మే 25న భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురికాగా కొండకింద ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది మరో భక్తురాలి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడగలిగారు. అదేవిధంగా 2024 అక్టోబరు 18న కొండకింద లక్ష్మీపుష్కరిణి వద్ద అనారోగ్యంతో భక్తురాలు మృతి చెందగా, అక్టోబరు 24న గుండెపోటుకు గురైన భక్తుడిని కొండకింద ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో హఠాత్మరణం చెందాడు. భక్తులనుంచి కానుకల రూపంలో ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతున్నా కనీసం వైద్యం అందించలేని దయనీయ పరిస్థితిలో యాదగిరిగుట్ట దేవస్థానం ఉంది. ప్రస్తుతం కొండపైన ప్రధాన కార్యాలయం ఎదుట బస్టాండ్‌ ప్రాంగణంలో ఎంఎస్‌, అల్యూమినియం పార్టీషనతో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు భక్తులకు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రి పక్కా భవనం నిర్మించేందుకు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.

త్వరలో వైద్యులను నియమిస్తాం

భక్తులకు అందాల్సిన వైద్యంకోసం త్వరలో వైద్యున్ని నియమిస్తాం. ఇప్పటికే ఎయిమ్స్‌ వైద్యులను సంప్రదించాం. ఒకవేళ అక్కడి వైద్యులు వైద్యం అందించేందుకు ముందుకు రాకపోతే, నోటిఫికేషన ద్వారా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో వైద్యడిని ఎంపిక చేసేందుకు యోచిస్తున్నాం. భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.

Updated Date - Oct 29 , 2024 | 06:42 AM