కార్పొరేట్ శక్తులకు కేంద్రం ఊడిగం
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:26 AM
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, పేదలను విస్మరిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి విమర్శించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
అనంతగిరి, అక్టోబరు 1 : కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, పేదలను విస్మరిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి విమర్శించారు. మండలంలోని అమీనాబాద్ గ్రామంలో మంగళవారం జరిగిన ఆ పార్టీ మండల కమిటీ సభ్యుడు సాదె కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దలకు అనుకూలమైన నిర్ణయాలు చేస్తూ పేదలను విస్మరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదన్నారు. మహాసభ ప్రారంభ సూచికగా పార్టీ జెండా ను ఆ పార్టీ సీనియర్ నాయకురాలు వెంపటి ఉప్పమ్మ ఆవిష్కరించారు. ఈ మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మిట్టగణుపుల ముత్యాలు, రాపోలు సూర్యనారాయణ, నారాయణ, కాసాని కిషోర్ పాల్గొన్నారు.
Updated Date - Oct 02 , 2024 | 12:27 AM