ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేవంత్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్‌

ABN, Publish Date - Dec 14 , 2024 | 01:44 AM

మహిళల ని కూడా చూడకుండా ఆశా కార్యకర్తలపై పోలీసులతో అ మానుషంగా దాడి చేయించి న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నా రు.

మాజీ ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌

మోత్కూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహిళల ని కూడా చూడకుండా ఆశా కార్యకర్తలపై పోలీసులతో అ మానుషంగా దాడి చేయించి న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నా రు. ఈ నెల 9న మోత్కూరు మునిసిపాలిటీ కేంద్రానికి చెందిన ఆశా కార్యకర్త ఎస్‌కె రహీంబీ పోలీసుల లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చ గా అక్కడ డాక్టర్లు రెండు రోజులు చికిత్స అం దించి, ఆరోగ్యం మెరుగైందని ఈ నెల 11న ఇం టికి పంపించారు. ఇంటికి వెళ్లిన రెండో రోజే ఆమె అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ సభ్యులు ఆమెను నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెసుకున్న మాజీ ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయంగా రూ.20వేలు ఆర్థిక సహాయం అందించారు. ఆస్ప త్రి ఖర్చులు తానే భరిస్తానని ఆమెకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగిన వారిపై పోలీసులతో దాడులు చే యిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పైశాచికానందం పొందుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 25వేల మంది ఆశా కార్యకర్తల బాధను అర్థం చేసుకుని వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నా రు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి ఆయన వెంట ఉన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 01:44 AM