సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును అంగీకరించేదిలేదు
ABN, Publish Date - Oct 27 , 2024 | 12:51 AM
ప్రజలకు హాని కలిగించే సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో కలెక్టర్‌తో అఖిలపక్షం భేటీ
రామన్నపేట, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు హాని కలిగించే సిమెంట్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం అఖిలపక్షం నాయకులతో కలిసి కలెక్టర్ హనుమంతు కె.జెండగే జాయింట్ కలెక్టర్ హనుమంతు కే.జెండగే, జాయింట్ కలెక్టర్ బెన షోలోమ్‌లను కలిశారు. అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని 23న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన పూర్తి స్థాయి నివేదికను యఽథాతథంగా పంపించి, పరిశ్రమ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రామన్నపేట మండల ప్రజల పక్షాన నిలబడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మేక అశోక్‌రెడ్డి, పర్యావరణ పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ జెల్లె పెంటయ్య, కో కన్వీనర్ ఎండీ.రేహన, కాంగ్రెస్ నాయకులు జినుకల ప్రభాకర్, పూస బాలకిషన, బీజేపీ మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య, సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ, టీడీపీ మండల నాయకులు ఫజల్ బేగ్, అఖిలపక్ష నాయకులు బోయిని ఆనంద్, ఎండీ.అక్రం, కందుల హనుమంతు, జమీరొద్దీన, గుర్క శివ, సుక్క శ్రవణ్, గుండాల భిక్షం పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 12:51 AM