ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గురుకుల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

ABN, Publish Date - Dec 15 , 2024 | 12:41 AM

గురుకుల విద్య కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అదనపు డీజీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. చౌటుప్పల్‌ మండలం తూఫ్రాన్‌పేట బీసీ వెల్ఫేర్‌ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం జరిగిన డైట్‌ చార్జీల పెంపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

అదనపు డీజీ స్టీఫెన్‌ రవీంద్ర

చౌటుప్పల్‌ రూరల్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): గురుకుల విద్య కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అదనపు డీజీ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. చౌటుప్పల్‌ మండలం తూఫ్రాన్‌పేట బీసీ వెల్ఫేర్‌ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం జరిగిన డైట్‌ చార్జీల పెంపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. తరగతి గదులు, హాస్టల్‌లో బియ్యం, పప్పుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శేఖర్‌రెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ శంభు లింగం, ప్రిన్సిపాల్‌ ఎ.జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనాన్ని అందించాలి

(ఆంధ్రజ్యోతి, భువనగిరి రూరల్‌): విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని పౌరసరఫరాలశాఖ రాష్ట్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఐఎ్‌ఫఎస్‌, వీఎ్‌సఎన్‌.ప్రసాద్‌ అన్నారు. శనివారం భువనగిరి మండలం అనంతారంలోని జ్యోతిబాపూలే సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలలో కామన్‌డైట్‌ ప్లాన్‌ను ప్రారంభించారు. వంటశాల, బియ్యం, కూరగాయలు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వీరమల్ల శ్రీనివా్‌సగౌడ్‌, జిల్లా సెర్ప్‌ అధికారి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థానంలో ఉండాలి : కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి, సంస్థాన్‌ నారాయణపురం): విద్యార్థులు నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థానంలో ఉండాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శనివారం సర్వేర్‌లోని గురుకుల పాఠశాలలో నూతన డెట్‌ను ఆయన ప్రా రంభించి మాట్లాడారు. సర్వేల్‌ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమం ది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారని, ఇక్కడి విద్యార్థులు చక్కగా చదువుకొని వారిలా ఉన్నత స్థానాలకు చేరాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన, పౌష్ఠికాహారం అందించేందుకు ప్రభు త్వం కామన్‌ డైట్‌ ప్లాన్‌ను ప్రారంభించిందని తెలిపారు. అదేవిధంగా కాస్మెటిక్‌ చార్జీలను పెంచిందన్నారు. గత ఏడాది పదో తరగతిలో గురుకుల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని, ఈసారి కూడా వందశాతం సాధించాలన్నారు. విద్యార్థులకు పట్టు తక్కువగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అభ్యాస దీపికను తప్పనిసరిగా సాధన చేయించి, పూర్తిచేయాలని ఉపాధ్యాయులను కలెక్టర్‌ ఆదేశించారు. అంతకుముందు కొత్త డైట్‌ మెనూ బోర్డును విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. అలాగే ఎస్‌వోపీ హ్యాండ్‌ బుక్‌ను విడుదల చేశారు. వంట గది, కూరగాయలు, సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్థు లు, వారి తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్‌ భోజనం చేశారు. కార్యక్రమంలో గురుకుల విద్యాలయ సంస్థ డిప్యూటీ సెక్రటరీ ప్రసాద్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశం, తహసీల్దార్‌ కృష్ణ, ఎంపీడీవో నర్సింహారావు, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి జయపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు

(ఆంధ్రజ్యోతి, బీబీనగర్‌): వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. శనివారం బీబీనగర్‌ బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన తనికీచేశారు. వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, సమస్యలను ప్రిన్సిపాల్‌ మాధవిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం నిర్వహించిన నూతన డైట్‌ ప్రారంభ కార్యక్రమానికి డీసీపీ రాజేశ్‌చంద్ర హాజరయ్యారు.

Updated Date - Dec 15 , 2024 | 12:41 AM