ముగిసిన ఐటీఎఫ్ మాస్టర్ సిరీస్
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:31 AM
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఐటీఎఫ్ మాస్టర్-100 పురుషుల డబుల్స్ టెన్సిస్ 40+ విజేతగా ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి జోడి నిలిచింది.
పురుషుల డబుల్స్‌లో విజేత ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి జోడి
భువనగిరి టౌన, సెప్టెంబరు4 : యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఐటీఎఫ్ మాస్టర్-100 పురుషుల డబుల్స్ టెన్సిస్ 40+ విజేతగా ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి జోడి నిలిచింది. బుధవారం నిర్వహించిన ఫైనల్స్‌లో చంద్రశేఖర్‌రెడ్డి, లగ్గాని శ్రీనివా్‌సతో కలిసి రజినీకాంత కులకర్ణి, రవితేజ ఉమెంతల జోడీపై 6-2, 6-3 వరుస సెట్లు పైచేయి సాధించి విజేతగా నిలిచారు. దీంతో ఆ జోడీకి సీనియర్స్ పురుషుల డబుల్స్‌లో 100పాయింట్లు లభించి ప్రపంచ ర్యాంకు మెరుగుపడనుంది. అలాగే పలు కేటగిరీల్లో 30 నుంచి 75ఏళ్లమహిళలు, పురుషులకు నిర్వహించిన సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ ఫైనల్స్ ఉత్సాహంగా సాగాయి. విజేతలకు యాదాద్రి జిల్లా టెన్నిస్ అసోసియేషన అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి, ఐటీఎఫ్ పరిశీలకుడు శివకుమార్‌రెడ్డి బహుమతులు అందజేశారు.నాలుగునెలల వ్యవధిలో జాతీయ, రెండు అంతర్జాతీయ టెన్నిస్ సిరీ్‌సలకు భువనగిరి ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ టెన్ని్‌సకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన సహాయ కార్యదర్శి పరమేశ కుమార్‌సింగ్ పాల్గొన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:31 AM