ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాతగుట్ట దారి మూశారు

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:02 AM

పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపడం లేదు.

తిరిగి రాలేక వెళ్లిపోతున్న భక్తులు

భువనగిరి అర్బన, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపడం లేదు. యాదగిరిగుట్ట పట్టణంలోని పాతగుట్ట చౌరస్తా అందుకు సాక్షీభూతంగా మిగిలింది. ఎలాగో అలాగా వెళ్లిన భక్తులు గుంతలుగా మారిన రోడ్డుతో నరకం అనుభవిస్తున్నారు. రెండో సారి పాతగుట్ట స్వామిని దర్శించుకునేందుకు విముఖత చూపడంతో భక్తులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట స్వామి ఆలయానికి వెళ్లాలంటే వ్యక్తిగత వాహనాలు, గుర్రపు బండ్లు (టాంగాలు), నడకమార్గం మినహా ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. కొండకింద ఆలయ వైకుంఠద్వారం నుంచి నిర్మించిన బ్రిడ్జి చివరలో అంటే కొద్దిదూరంలో పాతగుట్ట (చౌరస్తా)కు వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉంది. సుమారు రెండు కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం గుండా పాతగుట్ట ఆలయానికి భక్తులు వెళ్లేవారు. ఇప్పుడు రోడ్డు పూర్తిగా ధ్వంసం కాగా చౌరస్తాలో రోడ్డు మూసివేయడంతో భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగానే..

ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా సీఐ స్థాయిలో ట్రాఫిక్‌ పోలీసు వ్యవస్థ విస్తృతం అయ్యింది. ఒక ఎస్‌ఐ, 21మంది సిబ్బంది (ఇందులో 8మంది వివిధ కారణాలతో సెలవులపై ఉన్నారు) 13మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా ట్రాఫిక్‌ నియంత్రణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో చౌరస్తాలో రాకపోకలను నిలిచిపోగా అక్కడి నుంచి పట్టణంలోని పాత బస్టాండ్‌ ఎదురుగా యూటర్న్‌ వద్దకు మార్చారు. ఇక్కడి వరకు వచ్చిన వాహనాదారులు (భక్తులు) ట్రాఫిక్‌ అంతరాయంతో తిరిగి వెనుకకు వెళ్లలేక హైదరాబాద్‌ వైపు నేరుగా వెళ్లిపోతుండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా దారి తెలియక వెనుదిరుగుతున్నారు. దీంతో ఆలయ దర్శనానికి భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చౌరస్తా నుంచి పాదచారులు, వాహనదారులు, స్థానికులకు అటు ఇటు వెళ్లేందుకు బారీకేడ్లతో అసౌకర్యంగా మారింది. దారి చూపాల్సిన పోలీసు శాఖ అటువైపు వెళ్లే మార్గం బారికేడ్లతో పూర్తిగా మూసివేయడంతో స్థానికులు అసహనానికి గురవుతున్నారు. ఒకవేళ ఇష్టదైవాలను దర్శించుకునేందుకు పాతగుట్ట రోడ్డు మార్గం గుండా వెళ్లినా భక్తులు రోడ్డు చూసి చిరాకు పడుతున్నారు. గుంతలుగా మారిన దారిలో ప్రయాణించిన వారి ఒళ్లు హూనమవుతోంది. రెండో సారి పాతగుట్టకు వెళ్లాలంటే విముఖతను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన బారికేడ్లను తొలగించి పాతగుట్టకు వెళ్లేందుకు పోలీసు అధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.

సూచికలు లేవు..ప్రచారం నిర్వహించడం లేదు

యాదగిరిగుట్ట పట్టణంలో పాతగుట్టకు వెళ్లే రోడ్డు మార్గం సూచించే బోర్డులేవు. దీనికి తోడు యాదగిరిగుట్ట ప్రధాన దేవస్థానం మైకుల ద్వారా ప్రచారం నిర్వహించడం నిలిపివేసింది. పునరుద్ధరించాలని ఆలయ ఈవోకు ఇటీవల వినతిపత్రం అంద జేశాం. పట్టణంలో పాతగుట్టను సూచించే స్వాగత తోరణం తొలగించి కొత్తగా నిర్మించలేదు. ఆర్టీసీ అధికారులు బస్సులు పాతగుట్టకు నడపకపోవడంతో భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

-దండెబోయిన అనిల్‌కుమార్‌, 9వ వార్డు కౌన్సిలర్‌, యాదగిరిగుట్ట

వారంలో కొత్త విధానం అమలు చేస్తాం

బారికేడ్లు తొలగించి కొత్త విధానం అమలు చేస్తాం. సీసీ కెమెరాను ఏర్పాటు చేసి ఒక కాన్సిస్టేబుల్‌ను నియమిస్తాం. స్థానికులకు ఇబ్బందులు తొలిగించేందుకు బారికేడ్లను తొలగించి వాహనాలు వెళ్లేందుకు వారం రోజుల్లో తగిన ఏర్పాట్లు చేస్తాం. సరిపడా సిబ్బంది లేక ట్రాఫిక్‌ నియంత్రణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కొక్కటిగా పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

-ఎలగొండ క్రిష్ణ, ట్రాఫిక్‌ సీఐ, యాదగిరిగుట్ట

Updated Date - Oct 20 , 2024 | 01:02 AM