విస్తరిస్తున్న మద్యనిషేధ స్ఫూర్తి
ABN, Publish Date - Oct 17 , 2024 | 12:03 AM
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో మద్యనిషేధానికి మరో గ్రామం ముందడుగు వేసింది.
గట్టికల్, ఇస్తాళపురం బాటలో పాతర్లపహాడ్
గ్రామంలో మద్యనిషేధ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం, అమలు
బుధవారం బెల్ట్‌షాపుల నిర్వాహకులకు కౌన్సెలింగ్
ఆత్మకూరు(ఎస్), అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలో మద్యనిషేధానికి మరో గ్రామం ముందడుగు వేసింది. మద్యంతో జరుగుతున్న నష్టాలను ప్రజలు గ్రహించి మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మండలంలో గట్టికల్, ఇస్తాళపురం గ్రామాల్లో మద్యనిషేధం అమలవుతోంది. వాటి స్ఫూర్తితో పాతర్లపహాడ్ గ్రామంలో మద్యనిషేధం అమలుకు గ్రామస్థులు తీర్మానించారు. ఇందుకోసం అఖిలపక్షాలు ఐక్యమయ్యాయి. అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతిని పాతర్లపహాడ్ గ్రామంలో మద్యపాన నిషేధం కోసం ఆవిర్భవించిన మద్యపాన నిషేధ కమిటీ సారధ్యంలో బుధవారం గ్రామంలో మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. మద్యపానంతో జరుగుతున్న నష్టాలను గుర్తించి మాజీ ప్రజాప్రతినిధులు, ప్రధాన పార్టీల నాయకులు, యువజన సంఘాలు, విద్యావంతులు అంత ఏకతాటిపైకి వచ్చి ప్రజలకు వివరిస్తున్నారు. బుధవారం మద్యపాన కమిటీ చైర్మన దొంతగాని కరుణాకర్ సామర్ధ్యంలో బెల్ట్‌షాప్ నిర్వాహకులతో, పోలీస్ సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అధికారులు, గ్రామస్థులు కలిసి బెల్ట్‌షా్‌పల వద్దకు వెళ్లి మద్య నిషేధంపై కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసులను స్థానికులు సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచలు గణపారపు సత్యం, కేశబోయిన మల్లయ్య, గుంటూరి వీరన్న, సంద జానయ్య, పరాల వెంకన్న, గుండాల శ్రీశైలం, జహీర్‌బాబా, గణేష్, సైదులు, రవిందర్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
Updated Date - Oct 17 , 2024 | 12:03 AM