ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

ABN, Publish Date - Nov 23 , 2024 | 11:53 PM

ఎస్సీ వర్గీకరణ అమలుపై సుప్రీంకోర్టు తీరు అమలుకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

అభివాదం చేస్తున్న మంత్రి రాజనర్సింహ, మాదిగ కుల, ఉపకులాల నాయకులు

నల్లగొండ టౌన, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ అమలుపై సుప్రీంకోర్టు తీరు అమలుకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అందులో భాగంగా వనమెన కమిషనను ఏర్పాటు చేసిందన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో దళితుల రిజర్వేషన్ల వర్గీకరణపై ఆందోళన సాగుతోందని గుర్తుచేశారు. వర్గీకరణ అనేది జనాభా ప్రకారం మాదిగ, మాదిగ ఉపకులాలకు రావాల్సిన హక్కు అన్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని, రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగమన్నారు. వర్గీకరణపై 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం రేవంతరెడ్డి ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటుచేసి వాదనలు వినిపించాలని తనను కోరగానే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. తమ వాదనలు విన్న సుప్రీంకోర్టు వర్గీకరణను రాషా్ట్రలే చేసుకోవచ్చని తీర్పును ఇచ్చిందన్నారు. తీర్పు వచ్చిన వెంటనే సీఎం రేవంతరెడ్డి అసెంబ్లీలో వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వన మెన కమిటీ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం స్పందించి వర్గీకరణను అమలు చేస్తుందన్నారు. వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వారు కూడా తమ సోదరులే అని, సోదరభావంతో కలిసిమెలిసి జనాభాప్రకారం రిజర్వేషన్ల ఫలాలను పంచుకునేందుకు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, మాదిగ జాతి సంక్షేమం కోసం ఐక్యంగా వర్గీకరణ అమలు చేయించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రొఫెసర్‌ కాశీం మాట్లాడుతూ, వర్గీకరణ ఉద్యమంలో 12 మంది అమరులయ్యారని, వారి స్ఫూర్తితో వర్గీకరణను, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పొందాలన్నారు. వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా మాదిగ ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ మాట్లాడుతూ, వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులపై పార్టీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సభాధ్యక్షత వహించిన నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై సుప్రింకోర్టు తీర్పు అమలుకు సీఎం రేవంతరెడ్డి కట్టుబడి ఉన్నారని అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీలోని మాదిగ ప్రజాప్రతినిధులంతా దాని అమలు కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మేళనంలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు కాంపల్లి సత్తయ్య, కాలె యాదయ్య, పిడమర్తి రవి, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపతకుమార్‌, కొండేటి మల్లయ్య, నాగారం అంజయ్య, బొర్ర సుధాకర్‌, శ్రీనివాస్‌, మల్లేష్‌, శ్రీరాములు, దున్న యాదగిరి, పున్నా కైలాష్‌ పాల్గొన్నారు. ఏపూరి సోమన్న, చుక్క నర్సయ్య ఆట పాటలు సభికులను లరించాయి.

Updated Date - Nov 23 , 2024 | 11:53 PM