ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్రాంతి తర్వాత పేదలకు సన్న బియ్యం

ABN, Publish Date - Dec 16 , 2024 | 12:38 AM

సంక్రాంతి తర్వాత రేషన్‌ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. మండల కేంద్రంలోని సహకారం సంఘం కార్యాలయంలో రూ.32లక్షలతో నిర్మించిన రైతు సేవా భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

తుర్కపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి తర్వాత రేషన్‌ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. మండల కేంద్రంలోని సహకారం సంఘం కార్యాలయంలో రూ.32లక్షలతో నిర్మించిన రైతు సేవా భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. అంతేగాక రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సన్నరకాలకు రూ.500 బోనస్‌ కూడా ఇస్తోందన్నారు. మండలంలో కొన్ని చెరువులకు మోటార్ల ద్వారా గోదావరి జలాలు నింపుతామన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు వద్దని, పార్టీలకతీతంగా అందరి సూచనలు, సలహాలతో నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. మండల కేంద్రంలో సొంత నిధులతో రైతు సేవా భవన సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. పీఎసీఏస్‌ కార్యాలయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్భందులు తలెత్తకుండా ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో పీఎసీఏస్‌ చైర్మన్‌ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, ఆలేరు మార్కెట్‌ చైర్‌పర్సన్‌ అయినాల చైతన్యమహేందర్‌రెడ్డి, ఎంపీడీవో ఝాన్సీలక్ష్మిబాయి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ధనావతు శంకర్‌నాయక్‌, పీఎసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కొండ్ర ముత్యాలు, మాజీ ఎంపీపీ బోరెడ్డి రాంరెడ్డి, మాజీ డీసీసీబీ డైరెక్టర్‌ పిన్నెపురెడ్డి నరేందర్‌రెడ్డి, న్యాయవాది పడాల శ్రీనివా్‌సపటేల్‌ మాజీ సర్పంచ్‌లు కల్లూరి నర్సింహరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బాల్‌నర్సింహ, మల్లేశ్‌, రాంరెడ్డి, పోగుల ఆంజనేయులు, బోరెడ్డి హన్మంతరెడ్డి, మేకల బాలకృష్ణ, గుగులోతు భాస్కర్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 12:38 AM