ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అడుగుజాడలో నడవాలని.. నిత్యం స్మరించాలని

ABN, Publish Date - Oct 01 , 2024 | 11:55 PM

నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పలుగ్రామాల ప్రజలు స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుండి నడిపించిన మహాత్ముడు మోహనదా్‌స కరమ్‌చంద్‌ గాంధీపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.

స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే గాంధీ విగ్రహాల ఏర్పాటు

నిజాం కాలంలోనూ ఏర్పాటు

గాంధీ మార్గం వారికి అనుసరణీయం

చిట్యాల రూరల్‌, అక్టోబరు 1 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పలుగ్రామాల ప్రజలు స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుండి నడిపించిన మహాత్ముడు మోహనదా్‌స కరమ్‌చంద్‌ గాంధీపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. రజకారుల సమయంలోనూ, స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే గాంధీ, కస్తూర్బా విగ్రహాలను ఏర్పాటుచేసి ఆయన్ను స్మరించుకున్నారు. సత్యం, క్రమశిక్షణ, సన్మార్గంలో పయనించాలని గాంధీని మహాత్ముడిగా కొలుస్తూ భక్తిని చాటుకున్నారు. రజాకారుల పరిపాలన కొనసాగుతున్నా ధైర్యంతో గాంధీ విగ్రహం తమ కళ్లెదుట ఉండాలనే ఆకాంక్షతో భక్తితో ఏర్పాటుచేసుకున్నారు. మండలంలోని పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, వెలిమినేడు గ్రామాల్లో గాంధీ విగ్రహాలను ఏర్పాటుచేసుకుని జయంతి, వర్ధంతులు నిర్వహిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు

వెలిమినేడు గ్రామానికి చెందిన రూపని చిన్నరాములు 1982లో గాంధీ విగ్రహాన్ని గ్రామానికి బహుకరించారు. దీంతో గ్రామపంచాయతీ సమీపంలోని గ్రంథాలయం వద్ద ప్రత్యేకంగా దిమ్మెను ఏర్పాటు చేసి, అదే ఏడాది అక్టోబరు 21న అప్పటి కలెక్టర్‌ కే లక్ష్మీనారాయణతో విగ్రహావిష్కరణ చేయించారు. అప్పటినుంచి మహాత్మా గాంధీని స్మరించుకుంటూ గ్రామస్థులు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రజాకారుల కాలంలోనే గాంధీ విగ్రహం

రజకారుల పాలన సమయంలో నాకు 18 ఏళ్లు. గ్రామానికి చెందిన కందిమళ్ళ జగ్గారెడ్డి, ఆకారపు భిక్షపతి కలిసి 1948-49 కాలంలో గాంధీ విగ్రహం ఏర్పాటుచేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాథమికపాఠశాల భవనం అప్పట్లో పోలీ్‌సస్టేషనగా ఉండేది.దాని ఎదురుగా వారి ద్దరూ పట్టుదలతో దిమ్మెను నిర్మించి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రజాకార్లు వారిని ఏమీ అనలేదు. ఆ రోజుల్లో గాంధీ విగ్రహానికి పూజలుచేసేవాళ్లం. అనంతరం జయంతి, వర్ధంతి కార ్యక్రమాలను చేస్తున్నాం.

- మైల మాలేగాం, పెద్దకాపర్తి

భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని...

గ్రామానికి చెందిన పాశం సీతారెడ్డి కుమారుడు రాంరెడ్డి 1950లో రాంరెడ్డి మొదట గాంధీ విగ్రహం తీసుకురాగా మురళమ్మ తమతో పాటు గ్రామంలోని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలనే ఆకాంక్షతో కస్తూర్బా విగ్రహాన్ని కూడా తీసుకురావాలని కోరగా ఆమె విగ్రహాన్ని తెచ్చారు. వీటిని గ్రామకూడలిలో ఏర్పాటు చేశారు. ఊహ తెలిసేంతవరకు విద్యనభ్యసించే చిన్నారులు, యువకులు, పెద్దలు మహాత్ముని విగ్రహం ఎదుట చుట్టూ కూర్చుని భక్తి శ్రద్ధలతో ఎంతో ఇష్టంగా భజన చేసేవాళం.

-గంగాపురం అంజయ్య, చిన్నకాపర్తి

Updated Date - Oct 01 , 2024 | 11:55 PM