ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బస్సు ప్రయాణం..బహు కష్టం

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:42 AM

ఆర్టీసీ బస్సుల కోసం బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు.

బస్టాండ్‌ ఫ్లాట్‌ ఫాంపై ప్రైవేట్‌ వాహనాలు

భువనగిరి టౌన, నవంబరు 20: ఆర్టీసీ బస్సుల కోసం బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసి యాజమాన్యం బస్సులను నడపక పోతుండడంతో బస్సులో ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు సీటు దొరకడం కష్టంగా మారింది. ఒక్క బస్సు వస్తే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి నిత్యకృత్యంగా మారింది. ఇదే అదునుగా నిబంధనలకు పాతరేస్తూ ఆటోలతో సహా పలు ప్రైవేట్‌ క్యాబ్‌లు ఏకంగా ప్లాట్‌ఫారాల ముందు నిలుచుని సీట్లకు మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. దీంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతుండడంతో పాటు ప్రయాణికుల క్షేమ ప్రయాణం ప్రశ్నార్థకంగా మారుతోందని పలువురు వాపోతున్నారు. ఈ తరహా సన్నివేశాలు బుధవారం ఆంధ్రజ్యోతి కంట పడ్డాయి. అయితే ప్రతీ రోజూ ప్రయాణ కష్టాలు ఇలాగే ఉంటున్నాయని పలువురు పేర్కొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:43 AM