ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వడపర్తి కాల్వ పనులను పూర్తి చేయాలి

ABN, Publish Date - Jun 04 , 2024 | 12:27 AM

వడపర్తి నుంచి భువనగిరి పెద్ద చెరువులోకి నీరు వెళ్లే రాచకాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌చేశారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌

భువనగిరి రూరల్‌, జూన్‌ 3: వడపర్తి నుంచి భువనగిరి పెద్ద చెరువులోకి నీరు వెళ్లే రాచకాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌చేశారు. సోమవారం మండలంలోని అమలాపురం శివారులో రాచకా ల్వ పనులను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం సమీపించినా పనులను పూర్తి చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అదేవిధంగా మధ్యమధ్యలో నిలిచిపోయిన కల్వర్టు పనులను పూర్తిచేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. లేదంటే కలెక్టరేట్‌ ఎదుట రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, నాయకులు దయ్యాల నర్సింహ, మోటే ఎల్లయ్య, బండి శ్రీను, సత్తిరెడ్డి, అంజిరెడ్డి, ప్రభాకర్‌, అంజయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 12:27 AM

Advertising
Advertising