ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూరగాయాలు

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:52 AM

కూరగాయల ధరలు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. సామాన్యుడికి అందకుండా పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థికంగా భారం పడుతోంది.

రోజురోజుకూ పెరుగుతున్న ధరలు

సామాన్యులు, మధ్య తరగతిపై ఆర్థిక భారం

(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): కూరగాయల ధరలు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. సామాన్యుడికి అందకుండా పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థికంగా భారం పడుతోంది.

జిల్లాలో నెలరోజుల క్రితం వరకు కూరగాయల ధరలు ఓ మోస్తరుగా ఉండగా, ప్రస్తుతం అమాంతం పెరిగి రెండింతలయ్యాయి. ధర తక్కువగా ఉన్నప్పుడు కిలో కూరగాయలు కొనే వినియోగదారుడు ప్రస్తుతం పావుకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. కూరగాయల సాగుకు తగిన ప్రోత్సాహకం లేకపోవడంతో జిల్లాలో వీటి సాగు పెరగడంలేదు. దీనికి తోడు దిగుబడికి అనుగుణంగా మార్కెటింగ్‌ సదుపాయం లేక కూరగాయల సాగుపై రైతులు ఆసక్తి చూపడంలేదు. హైదరాబాద్‌ నగరానికి అతిచేరువలో ఉన్నా, జిల్లాలో మాత్రం కూరగాయల సాగు తక్కువగా ఉంది. వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో జిల్లాలో కేవలం 1,800 ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగవుతున్నాయి. అది కూడా భువనగిరి, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో మాత్రమే. ఈ ప్రాంతంలో జిల్లా ప్రజలకు సరిపడా కూరగాయల దిగుబడి లేదు. దీంతో ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి తగ్గడంతో మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

టమాట రూ.50

టమాట నెలరోజుల క్రితం కిలోకు రూ.25 నుంచి రూ.30వరకు ఉంది. 15 రోజుల్లో ధర రెండింతలు పెరిగింది. ప్రతీ కూరలో వినియోగించే టమాట ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. భువనగిరి రైతుబజారులో కిలో టమాట సోమవారం రూ.50లకు చేరింది. ఒక టమాటనే కాదు, చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ, దొండతో పాటు పచ్చి మిర్చి ధర మూడింతలైంది. ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. గతంలో రూ.20కు ఆకుకూర కట్టలు నాలుగైదు వచ్చేవి. ప్రస్తుతం రెండు నుంచి మూడు కూడా రావడం లేదు. దీంతో మార్కెట్‌కు కూరగాయల కోసం వచ్చిన వినియోగదారులకు ధరలతో గుండె దడ పడుతోంది. చాలీచాలని సంపాదనతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలనే తట్టుకోలేని పరిస్థితిలో రెండు నుంచి మూడు వారాలుగా పెరుగుతున్న కూరగాయల ధరలతో ఆర్థికంగా మోయలేని భారం పడుతోందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూరగాయల సాగు, దిగుబడి, మార్కెటింగ్‌పై దృష్టి సారించి సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

వర్షాభావంతో తగ్గిన దిగుబడి

కూరగాయల సాగుకు ప్రభుత్వం నుంచి తగినంత ప్రోత్సాహకం కరువైంది. దీంతో సా గు విస్తీర్ణం తగ్గి దిగుబడిపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆరుతడి పంటల సాగు తగ్గిం ది. బొమ్మలరామారం, తుర్కపల్లి, పోచంపల్లి, భువనగిరి మండలాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగయ్యేవి. ఈ సారి ఈ ప్రాంతాల్లో కూడా కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. ఇటీవల కురిసిన వర్షాలతోనైనా వీటి సాగు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కూరగాయలు ధరలు రెండింతలు పెరిగాయి :బత్తుల జంగమ్మ, గృహిణి

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ధరలు వింటేనే భయమేస్తోంది. నెల రోజుల్లో దాదాపు రెండింతలుగా ధరలు పెరిగాయి. ఈ ధరలతో ఏం కొనుగోలు చేయాలో కూడా అర్థం కావడం లేదు. గతంలో కిలో కూరగాయలు కొనుగోలు చేసేవారం, ప్రస్తుతం అరకిలోతో సరిపుచ్చుకుంటున్నాం. కూరగాయల ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Updated Date - Oct 22 , 2024 | 12:52 AM