నీటిని పొదుపుగా వాడుకోవాలి
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:34 AM
శాలిగౌరారం ప్రాజెక్టు నీటిని పొదుపుగా వాడుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.
శాలిగౌరారం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : శాలిగౌరారం ప్రాజెక్టు నీటిని పొదుపుగా వాడుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. యాసంగి సీజనకు గాను సోమవారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టు నీటిని కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంతరెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
కస్తూర్బా బాలికల పాఠశాల తనిఖీ
శాలిగౌరారంలోని కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సామేల్ తనిఖీ చేశారు. హాస్టల్ గదులను, తరగతి గదులను, వంట గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. బాలికలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట ఐబీ డీఈ సత్యనారాయణ, తహసీల్దార్ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందాల సమరంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, చామల వెంకటరమణారెడ్డి, ఐబీ ఏఈ రాములు, నోముల జనార్దన, చామల జైపాల్‌రెడ్డి, జోగు శ్రీనివాసులు, పడాల రమేష్, పుల్లూరి దేవేందర్, మంగదుడ్ల శ్రీనివాస్, పడాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 12:34 AM