ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తిచేస్తాం

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:57 AM

ఐదేళ్ల కాలంలో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వచ్చే మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పూర్తిచేసి గ్రావిటీ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

బీ.వెల్లెంల ప్రాజెక్టు ఘనత వెంకట్‌రెడ్డిదే : మంత్రి ఉత్తమ్‌

ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ను బ్రతిమిలాడా : మంత్రి వెంకట్‌రెడ్డి

నార్కట్‌పల్లి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల కాలంలో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వచ్చే మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పూర్తిచేసి గ్రావిటీ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 7న మండలంలోని బీ.వెల్లెంలలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. తొలుత రిజర్వాయర్‌ను సందర్శించి తర్వాత స్తూపావిష్కరణ జరిగే పైలాన్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమై బీఆర్‌ఎస్‌ పాలనలో నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. బీ.వెల్లెంల ప్రాజెక్టును కేసీఆర్‌ రాజకీయ దురుద్దేశంతోనే పూర్తిచేయకుండా నిలిపివేశారని విమర్శించారు. కాంగ్రె్‌సకు ప్రజలు అధికారం ఇవ్వడంతోనే నియంత పాలన అంతమై ప్రజాపాలన మొదలైందన్నారు. బీ.వెల్లెంల ప్రాజెక్టు ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిదేనని అన్నారు. మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, బీ.వెల్లెంల ప్రాజెక్టు కోసం కేసీఆర్‌ కాళ్లు పట్టుకోవడం మినహా అన్ని రకాలుగా ప్రాధేయపడ్డానన్నారు. ప్రాజెక్టు నా కోసం కాదని, నాకు గ్రామంలో 3 ఎకరాల భూమి మాత్రమే ఉందని, మూసీ మురుగు, ఫ్లోరైడ్‌ విషపు నీటిని తాగుతున్న జిల్లా ప్రజల కోసమేనని ఆవేదన వ్యక్తం చేస్తు ప్రాజెక్టు పూర్తిచేస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చి మోసం చేశాడన్నారు. ఏది ఏమైనా తమ ప్రభుత్వంలోనే ప్రాజెక్టు ప్రారంభానికి నోచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ప్రాజెక్టు స్వరూపాన్ని, నీటి పంపింగ్‌ చేసే విధానాన్ని అధికారులు మ్యాప్‌ల ద్వారా వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఇలాత్రిపాఠి, ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శి వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు ఎస్పీ రాములునాయక్‌, ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్‌, ఈఈ గంగం శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌డీవో అశోక్‌రెడ్డి, డెయిరీ డెవల్‌పమెంట్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, బత్తుల ఊశయ్య, పబ్బతిరెడ్డి వెంకట్‌రెడ్డి, బండ సాగర్‌రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, పాశం శ్రీనివా్‌సరెడ్డి, పుల్లెంల అచ్చాలు, వడ్డే భూపాల్‌రెడ్డి, సాగర్ల సైదులు, జెరిపోతుల భరత్‌, ఐతరాజు యాదయ్య, బింగి కొండయ్య, గడ్డం పశుపతి, ఎస్‌కే సమద్‌, పల్లె నరేందర్‌రెడ్డి, బొడిగె స్వామి, తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో ఉమేశ్‌, డీఈఈ విఠలేశ్వర్‌, ఆర్‌ఐ తరుణ్‌, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే నినాదం

(ఆంధ్రజ్యోతి, దామరచర్ల): అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నినాదంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం మండలంంలోని వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమను హెలికాప్టర్‌లో వచ్చి పరిశీలించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ఏడాది పాలన కొనసాగించిందని, మరో నాలుగేళ్ల పాలన సైతం ఇంతే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతుందన్నారు. ఈనెల 7న సీఎం రేవంత్‌రెడ్డి 800 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న యూనిట్‌-2ను ప్రారంభించనున్నారని తెలిపారు. జిల్లా చరిత్రలో ఈ సందర్భం నిలిచిపోతుందన్నారు. అనంతరం పరిశ్రమలోని కంట్రోల్‌రూమ్‌, సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్న పైలాన్‌ను వారు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వారి వెంట ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌, తదితరులు ఉన్నారు.

ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డ్‌

(ఆంద్రజ్యోతి, మిర్యాలగూడ): ధాన్యం ఉత్పత్తిలో దేశ చరిత్రలో తెలంగాణ రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించిందని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సాయితేజ రైస్‌మిల్లులో నూతన టెక్నాలజీతో నిర్మించిన సైలోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ, వరుణుడి కరుణతో సమృద్ధిగా వర్షాలు కురిసి వానాకాలంలో దేశంలోనే అత్యధిక ధాన్యం దిగుబడిని సాధించామన్నారు. అందుకు తెలంగాణ 10 ఉమ్మడి జిల్లాల ప్రజలకు ప్రభుత్వం తరఫున సెల్యూట్‌ చేస్తున్నాని అన్నారు. రాష్ట్రంలో 40లక్షల మంది రైతులు 66.7లక్షల ఎకరాల్లో 153లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి సాధించారన్నారు. సన్న ధాన్యానికి మద్దతు ధరకు తోడు ప్రభుత్వం క్వింటకు రూ.500 బోనస్‌ కల్పించడంతో రైతులు సుమారు రూ.35వేల కోట్ల వరకు లబ్ధిపొందారని అన్నారు. యాసంగిలో కూడా బోనస్‌ ఇస్తామన్నారు. వ్యవసాయ శాస్తవేత్తల సూచనమేరకు తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్‌ఎంటీ లాంటి సన్నరకం ధాన్యాన్ని రైతులు సాగుచేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్ల పౌరసరఫరాలశాఖ రూ.58వేల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోగా, తమ ప్రభుత్వం వచ్చాక రూ.11వేల కోట్లు చెల్లించి అప్పును రూ.47వేల కోట్లకు తగ్గించిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రె్‌సకు కంచుకోట అని, గత ప్రభుత్వాల కాలంలో కార్యకర్తలు దాడులకు వెరవకుండా నిలిచారని కొనియాడారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ఐదు ఎత్తిపోతల పథకాలను ఏడాదిలోగా పూర్తి చేయిస్తామన్నారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంటుందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో కాకుండా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు సన్నధాన్యానికి రూ.500 బోనస్‌ కల్పించిందన్నారు. వరి సాగులో నల్లగొండకు కరీంనగర్‌ జిల్లాల మధ్య పోటీ సాగుతోందని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరారవు మాట్లాడుతూ, మిల్లర్లు ఒకటి రెండు రూపాయలు లాభం చూసుకొని రైతుల ధాన్యానికి సరైన ధర కల్పించాలన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడి రాష్ట్ర గౌరవాన్ని నిలపాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, డీఎ్‌సవో వెంకటేశ్వర్లు, డీఎం హరీష్‌, మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్‌, ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్‌, సహాయ కార్యదర్శి రేపాల మధుసూదన్‌, మిర్యాలగూడ అసోసియేషన్‌ నాయకులు గౌరు శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షలు కర్నాటి నారాయణ, చిట్టిపోలు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

చరిత్రలో నిలిచేలా సభ నిర్వహిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై, సీఎంగా రేవంత్‌రెడ్డి, మంత్రులుగా మేం ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చరిత్రలో నిలిచిపోయేలా నల్లగొండలో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఈ ఏడాది కాలంలో ఎన్నో పనులు చేశాం. ఇంకా కీలకమైన ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల, ఇతర అన్ని ప్రాజెక్టుల పనులు వేగంగా నిర్వహిస్తున్నాం. జిల్లాకు ప్రగతి నివేదికను సీఎం తన ప్రసంగంలో చెబుతారు. జిల్లా చరిత్రలో మా ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రగతిని సాధించేలా కార్యాచరణ అమలు చేస్తాం. ఈ పనులను సభలో వివరిస్తాం.

పటిష్ఠ భద్రత: ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌

నల్లగొండ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేప థ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. శుక్రవారం సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. సీఎం పర్యటన సందర్భంగా ఐజీ, డీఐజీ,ఐదుగురు ఎస్పీలు,10మంది అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 75మంది సీఐలు, 170మంది ఎస్‌ఐలు, 2,500మందితో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. సభకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

సకల హంగులతో మెడికల్‌ కళాశాల

రూ.160కోట్లతో పూర్తయిన నిర్మాణం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెం వద్ద 42ఎకరాల్లో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల సకల హంగులతో సిద్ధమైంది. ఈ కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. 2022 ఆగస్టులో కళాశాల భవనానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కళాశాల భవన సముదాయం గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తులు, బాలికల వసతి గృహం గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు ఐదంతస్తులు, బాలుర వసతి గృహం గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు ఐదంతస్తులు నిర్మించారు. వీటితో పాటు ప్రిన్సిపాల్‌ క్వార్టర్స్‌ గ్రౌండ్‌ప్లోర్‌తో పాటు మూడు అంతస్తుల్లో నిర్మించారు. క్యాంటిన్‌ను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. ప్రహరీ, పార్కింగ్‌ సదుపాయాలు కల్పించారు. ప్రాంగణమంతా గ్రీనరి, చెట్లతో కళకళలాడుతోంది. ఇదే ప్రాంగణంలో నర్సింగ్‌ కళాశాల నిర్మాణానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో కొనసాగుతున్న మెడికల్‌ కళాశాలను త్వరలో ఈ భవన సముదాయంలోకి మార్చనున్నారు.

సీఎం పర్యటన ఇలా...

సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తయిన రోజే సీఎం నల్లగొండ పర్యటనకు వస్తుండడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

శనివారం మధ్యాహ్నం 2గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.

2.25గంటలకు నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలకు చేరుకొని ప్రాజెక్టు డెలివరీ ఛానల్స్‌ను ప్రారంభించి పైలాన్‌ ఆవిష్కరిస్తారు. అనంతరం గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు.

2.55గంలకు బయల్దేరి 3.15గంటలకు దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌పవర్‌స్టేషన్‌కు చేరుకుంటారు. 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్‌-2లో విద్యుదుత్పాదన ప్రక్రియను ప్రారంభిస్తారు. అక్కడే 4గంటల వరకు గడుపుతారు.

4.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి నల్లగొండ మెడికల్‌ కళాశాలకు 4.25గంటలకు చేరుకుంటారు. మెడికల్‌ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు.

సాయంత్రం 5గంటలకు మెడికల్‌ కళాశాల సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ వద్ద రాజీవ్‌ ప్రాంగణంలో నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు.

సాయంత్రం 6గంటలకు సభ ముగిశాక రో డ్డుమార్గాన సీఎం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

Updated Date - Dec 07 , 2024 | 12:57 AM