గాంధీ ప్రవచనాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:01 AM
గాంధీ ప్రవచించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ రాష్ట్ర చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గానాల ప్రభాకర్‌రెడ్డి, బుర్ర దశరథగౌడ్ తెలిపారు.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ రాష్ట్ర చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గాంధీ ప్రవచించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ రాష్ట్ర చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గానాల ప్రభాకర్‌రెడ్డి, బుర్ర దశరథగౌడ్ తెలిపారు. బుధవారం యాదగిరిగుట్టలో సంస్థ ముఖ్యుల సమావేశంలో వారు మాట్లాడారు. డిసెంబరు 22న గుట్టలో గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నామని, అందులో సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేస్తున్న 10 రాష్ట్రాలకు చెందిన 115 మంది ఉత్తమ రైతులు, వ్యవసాయరంగ అధికారులు, శాస్త్రవేతలు, వైద్యులు, జర్నలిస్టులు, ఎఫ్‌పీవోలకు కిసాన్ సేవా రత్న అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కన్వీనర్ పడమటి పావని, కార్యనిర్వాహక కార్యదర్శి మెరుగు మధు, గాంధారి ప్రభాకర్, సంజయ్‌రెడ్డి, రాంబాబు, పాలకూర వెంకటేశ్వర్లు, డాక్టర్ మిర్యాల దుర్గాప్రసాద్, వెంకన్న, బాలరాజు, చిరంజీవినాయక్, సతీష్, పవన్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Nov 21 , 2024 | 12:01 AM