ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రుణాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:56 AM

బ్యాంక్‌ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలని ఇందిరా మహిళా శక్తి మిషన్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ప్రసన్నకుమార్‌ అన్నారు.

ఇందిరా మహిళా శక్తి మిషన్‌ కోఆర్డినేటర్‌ ప్రసన్నకుమార్‌

భువనగిరి టౌన్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యో తి): బ్యాంక్‌ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలని ఇందిరా మహిళా శక్తి మిషన్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ప్రసన్నకుమార్‌ అన్నారు. మహిళా శక్తిరుణాలతో భువనగిరిలో మహిళా సంఘా లు ఏర్పాటు చేసిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, మహిళా క్యాంటీన్‌ను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. బ్యాంక్‌ రుణాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించరాదని, వ్యాపార అభివృద్ధికి వినియోగించాలని సూ చించారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణం గా వ్యాపారాలను ఎంచుకోవాలన్నారు. రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తే రుణ పరపతి పెరుగుతుందని గ్రహించాలన్నారు. మునిసిపల్‌ రుణ వ్యవస్థను ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ పి.రామాంజుల్‌రెడ్డి, జిల్లా మిషన్‌ కోఆర్డినేటర్‌ రమే ష్‌, మెప్మా అధికారులు, ఆర్‌పీలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 12:56 AM