గజ గజ
ABN, Publish Date - Dec 17 , 2024 | 01:01 AM
ఉమ్మడి జిల్లాలో చలి గాలులు విజృంభిస్తున్నాయి. ఈ సీజన్‌లో మొదటిసారి సో మవారం 16.0డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజ గజా వణుకుతున్నారు. శీతాకాలంలో గతానికి భిన్నంగా రోజంతా చలి ఉంటోంది.
ఈ సీజన్‌లో అతి కనిష్ఠ ఉష్ణోగత్ర 16డిగ్రీలు నమోదు
చలి తీవ్రత తట్టుకోలేక ఆలయ వాచ్‌మన్ మృతి
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): ఉమ్మడి జిల్లాలో చలి గాలులు విజృంభిస్తున్నాయి. ఈ సీజన్‌లో మొదటిసారి సో మవారం 16.0డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజ గజా వణుకుతున్నారు. శీతాకాలంలో గతానికి భిన్నంగా రోజంతా చలి ఉంటోంది.
చలి తీవ్రతను తట్టుకోలేక ప్రజలు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. ప్రధానం గా స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, గ్లౌజ్‌లు, ఉన్ని దుస్తులు కొనుగోలుచేస్తున్నారు. అయినా చలి నుంచి తట్టుకోలేకున్నామని వృద్ధులు వాపోతున్నారు. ప్రజలు తెల్లవారుజామున లేచి పనులపై బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. సాయంత్రం 4 గంటల నుం చి వణికిస్తున్న చలి మరుసటి రోజు ఉదయం 9గంటల వరకు కూడా ఉంటోం ది. చలి కారణంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంటుండటంతో రోడ్లపై వాహన రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రజలు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఉదయం, సాయంత్రం చలిమంట వేసుకుంటూ చలి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రెండు రోజులు కూడా ఉమ్మడి జిల్లాలో చలి గాలులు పెరగడంతో పాటు ఉదయం వేళలో పొగమంచు దట్టంగా అలుముకునే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంటోంది. చలి తీవ్రత తట్టుకోలేక నల్లగొండ పట్టణంలోని తులసీనగర్‌లో ఉన్న హనుమాన్ గుడి వాచ్‌మెన్ చింతకాయల సత్తయ్య (61) మృతి చెందాడు.
ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా..
తేదీ గరిష్ఠం కనిష్ఠం
12 28.5 19.4
13 29.0 19.0
14 28.0 18.0
15 27.5 17.6
16 27.0 16.0
Updated Date - Dec 17 , 2024 | 01:01 AM