ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా నిరసన సెగ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవల బంద్..!

ABN, Publish Date - Aug 17 , 2024 | 12:52 PM

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది. దేశంలో వైద్యులంతా ఐక్యమై రోడ్డెక్కారు. ముందు తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తే.. తాము రోగుల ప్రాణాలు కాపాడతామంటూ వైద్యులు నినదిస్తున్నారు.

Doctors Strike

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది. దేశంలో వైద్యులంతా ఐక్యమై రోడ్డెక్కారు. ముందు తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తే.. తాము రోగుల ప్రాణాలు కాపాడతామంటూ వైద్యులు నినదిస్తున్నారు. మరోవైపు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగా.. త్వరగా విచారణ పూర్తిచేసి..నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సైతం నిరసనల్లో పాల్గొన్నారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పశ్చిమబెంగాల్ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన ఘటనపై దేశంలో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో ఏవైనా ఘటనలు జరిగేటప్పుడు స్వరాష్ట్రంలో మాత్రమే నిరసనలు జరిగేవి. తీవ్రత ఆధారంగా దేశ వ్యాప్తంగా నిరసన గళం వినిపించేది. ప్రస్తుతం కోల్‌కతా ఘటనపై ప్రతి ఒక్కరూ న్యాయం కోసం నినదిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో నిందితులందరిని తక్షణమే అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఆసుపత్రిలోని కొందరు వైద్యులు, సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడుల సాధనకు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌!


24 గంటల పాటు..

సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్య సేవలను నిలిపివేస్తుంటారు. కానీ కోల్‌కతా ఘటనపై ప్రయివేట్ ఆసుపత్రుల వైద్యులు 24 గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణలో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోతాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తోంది. కోల్‌కతా ఘటన అత్యంత హేయమని, బాధ్యులను ఇప్పటిరవకు గుర్తించకపోవడం, వైద్యులకు తగిన భద్రత, రక్షణ లేకపోవడం అన్యాయమని ఐఎంఏ నాయకులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు.
పోలవరానికి.. త్వరగా నిధులివ్వండి


వైద్యుల ధర్నా..

హైదరాబాద్ ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్‌లో ఐఎంఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా పలు పట్టణాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన ప్రదర్శనలు చేశారు. కోల్‌కతా ఘటనపై సీబీఐ విచారణను వేగవంతం చేసి నిందితులందరినీ అరెస్ట్ చేయాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐఎంఏ పిలుపుతో శనివారం ఉదయం 6గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలను నిలిపి వేస్తున్నట్లు రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రకటించాయి. అపోలో, కిమ్స్, స్టార్, యశోద, రెయిన్‌బో, కిమ్స్‌-సన్‌షైన్‌ ఆసుపత్రులు సహా వివిధ ఆసుపత్రుల్లో 24 గంటలపాటు ఓపీ ఉండబోదని, ఎమర్జెన్సీ సేవలు అందిస్తామని వెల్లడించాయి.


మధుసూదన రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telugu News Click Here

Updated Date - Aug 17 , 2024 | 12:52 PM

Advertising
Advertising
<