ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

ABN, Publish Date - Oct 15 , 2024 | 03:02 PM

దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార్ కేంద్రానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.

వికారాబాద్: దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. వికారాబాద్ జిల్లా దామగుండం వద్ద రాడార్ కేంద్రానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్ నాథ్ మాట్లాడుతూ.. రాడార్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర సర్కార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కృషి అభినందనీయం అని కొనియాడారు.


"అబ్దుల్ కలాం జయంతి నాడు ఈ రాడార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరగడం హర్షించదగ్గ విషయం. రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్‏కు మంచి పేరు ఉంది. దేశ భద్రతలో రాడార్ స్టేషన్ కీలకం. కమ్యూనికేషన్ రంగంలో టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. రాజకీయాలు వేరు.. దేశ భద్రత వేరు. తపాలా వ్యవస్థ అనేక ఏళ్లు ఉపయోగపడింది. ప్రస్తుతం ఇంట్లో కూర్చునే అనేక కోర్సులు నేర్చుకునే అవకాశం వచ్చింది. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం తగదు" అని రాజ్ నాథ్ మరోసారి ఉద్ఘాటించారు.

కలిసి పని చేస్తాం..

రాజకీయాలకతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాడార్ స్టేషన్ గా పూడూరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రం నిలుస్తుందని సీఎం అన్నారు. వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో భారత నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాడార్ స్టేషన్ కు భూమిపూజ చేసిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ భాగస్వామ్యం కీలకమన్నారు. రాడార్ స్టేషన్ పై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అబద్ధాలు చెప్పిందని... ఇప్పుడు ఈ అంశంలోనూ బీఆర్ఎస్ నేతలు అవే అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 03:05 PM