ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nilofer Hospital: సీఎం కార్యక్రమంలో ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత

ABN, Publish Date - Nov 16 , 2024 | 04:49 AM

వాంతులు, విరేచనాలతో నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించిన ఇద్దరు విద్యార్థులకు చికిత్స చేసేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. కారణం.. ఆస్పత్రిలో పన్నెండేళ్ల లోపు పిల్లలకే వైద్యం చేస్తామని, బాధిత విద్యార్థుల వయసు 13 ఏళ్లు అని.. నిబంధనల ప్రకారం వారికి నిలోఫర్‌లో చికిత్స చేయడం కుదరదని తేల్చేశారు.

  • ఎల్బీ స్టేడియం నుంచి నిలోఫర్‌కు పంపగా చికిత్సకు నిరాకరణ

  • వైద్య ఆరోగ్య కార్యదర్శి ఆదేశాలనూ లెక్కచేయని నిలోఫర్‌ అధికారులు

  • ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స

మంగళ్‌హాట్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): వాంతులు, విరేచనాలతో నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించిన ఇద్దరు విద్యార్థులకు చికిత్స చేసేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. కారణం.. ఆస్పత్రిలో పన్నెండేళ్ల లోపు పిల్లలకే వైద్యం చేస్తామని, బాధిత విద్యార్థుల వయసు 13 ఏళ్లు అని.. నిబంధనల ప్రకారం వారికి నిలోఫర్‌లో చికిత్స చేయడం కుదరదని తేల్చేశారు. బాధిత విద్యార్థు లు సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా నిర్వహించిన బాలల దినోత్సవంలో పాల్గొని అస్వస్థతకు గురి కావడం.. ఈ విషయం తెలిసినా నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు చికిత్సకు నిరాకరించడం గమనార్హం. బుధవారం నెహ్రూ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యా హ్నం సమయంలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కావడంతో స్టేడియంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి మరింత ఇబ్బందిగా మారుతోందని వెంటనే ఆ విద్యార్థికి గ్లూకోస్‌ పెట్టేందుకు కాన్యులాను అమర్చి.. అంబులెన్సులో నిలోఫర్‌కు పంపించారు.


నిలోఫర్‌లో చిన్నారి సహాయకులు ఓపీ చీటి కౌంటర్‌ వద్దకు వెళ్లి వివరాలు చెప్పగా.. బాధిత బాలుడికి 13 ఏళ్లు కాబట్టి ఇక్కడ చేర్చుకోవడం కుదరదని తేల్చిచెప్పారు. సీఎం కార్యక్రమం నుంచి తీసుకొచ్చామని చెప్పినా ఆస్పత్రిలో కేవలం 12 ఏళ్లలోపు వారిని మాత్రమే చేర్చుకుంటామని చెప్పి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. చేసేది లేక వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి స్వయంగా ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి ఆదేశించినప్పటికీ ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా బాదిత విద్యార్థిని తిరిగి పంపించినట్లు చర్చ జరుగుతోంది. ఎల్బీ స్టేడియంలో కార్యక్రమానికి హాజరై, అస్వస్థతకు గురైన ఓ 13 ఏళ్ల బాలిక విషయంలోనూ ఇలానే జరిగింది. సాయంత్రం నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో గురువారం ఉదయం నిలోఫర్‌కు తీసుకెళ్లారు. ఆమె బయసు 12 దాటిందని ముందు పట్టించుకోలేదు. అనంతరం ఓపీ చీటి ఇచ్చి ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం ఉస్మానియాకు వెళ్లాలని సూచించారు. చేసేది లేక ఆ బాలిక సైతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిసింది.


  • తీవ్రంగా మందలించిన డీఎంఈ

అస్వస్థతకు గురైన విద్యార్థుల పట్ల నిలోఫర్‌ వైద్యులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో ఉన్న డీఎంఈ వాణి గురువారం ఉదయం నిలోఫర్‌ ఆస్పత్రికి రాగా అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పాత భవనం గేటును మూసి వేసి కనీసం గేటు తీసేందుకు ససేమిరా అన్నారు. ఆస్పత్రిలో గేట్లు మూసి వేయడం ఏమిటని డీఎంఈ స్వయంగా సెక్యూరిటీ నిర్వహాకులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎట్టకేలకు డీఎంఈ నిలోఫర్‌ అధికారులకు ఫోన్‌ చేయడంతో వారు పరుగున వచ్చి ఆమెను లోపలికి తీసుకువెళ్లారు. ఓపీ చీటీలు ఇచ్చే కంప్యూటర్‌ ఆపరేటర్లు, అత్యవసర విభాగంలో పనిచేసే సిబ్బంది, పీజీ వైద్య విద్యార్థులు, డ్యూటీ డాక్టర్లతో డీఎంఈ మాట్లాడారు. వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని మండిపడినట్లు సమాచారం.

Updated Date - Nov 16 , 2024 | 04:49 AM