ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రేపటి నుంచి నృసింహుని కల్యాణ మహోత్సవాలు

ABN, Publish Date - May 20 , 2024 | 12:43 AM

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం యర్రవరంలోని బాలఉగ్రనరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన నలజాల జగన్నాథం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి నృసింహుని కల్యాణ మహోత్సవాలు

కోదాడ రూరల్‌, మే 19: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం యర్రవరంలోని బాలఉగ్రనరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి 23 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన నలజాల జగన్నాథం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి గణపతి పూజ, ఆరాధన, పుణ్యాహవాచనం, దీపారాధన, మూలమూర్తులకు కలశస్థాపన, శీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణం. రాహు, కేతు పూజలు, నవగ్రహ పూజలు, కుజగ్రహ దోష నివారణ పూజలు నిర్వహిఒస్తామన్నారు. 22వ తేదీ బుధవారం నరసింహస్వామి జయంతి సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి అష్టకలశ స్థాపన, పంచామృత, పంచసుగంధ ద్రవ్యాలతో స్వామివారి అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. 11 గంటలకు చెంచులక్ష్మి, రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి కల్యాణం నిర్వహిస్తామన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేస్తామన్నారు. సాయంత్రం ఐదు గంటలకు కుంకుమార్చనలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. . 23వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అగ్నిజ్ఞానం, సుదర్శన హోమాలు, పూర్ణాహుతి నిర్వహిస్తామన్నారు. ఈ కల్యాణ మహోత్సవాలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి హాజరవుతున్నట్లు తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

Updated Date - May 20 , 2024 | 12:43 AM

Advertising
Advertising