కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పరిశీలకులు
ABN, Publish Date - Jun 02 , 2024 | 11:03 PM
మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం హోళీమేరీ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆదివారం సాధారణ పరిశీలకులు డాక్టర్ ప్రియాంకశుక్లా, రిటర్నింగ్ అధికారి గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
మేడ్చల్ జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం హోళీమేరీ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆదివారం సాధారణ పరిశీలకులు డాక్టర్ ప్రియాంకశుక్లా, రిటర్నింగ్ అధికారి గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన చోట్ల పలు సలహాలు, సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో సీసీ కెమెరా, భారీకెడ్లు, కరెంటు, ఇంటర్నెట్, మౌలిక వసతులు పూర్తి అయినట్లు వెల్లడించారు. అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ జరుపాలని సూచించారు. నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా అన్ని విధాలుగా సన్నద్థమై ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పక్కాగా నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా నిబద్ధ్దతతో విధులు నిర్వహిస్తూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కీసర ఆర్డీవోఉపేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 02 , 2024 | 11:03 PM