ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Revanth: సీఎం రేవంత్‌ పేద విద్యార్థులకు దేవుడు: ఓయూ విద్యార్థి నేతలు

ABN, Publish Date - Jun 13 , 2024 | 03:20 AM

కార్పొరేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఓయూ విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సీఎం నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): కార్పొరేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఓయూ విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సీఎం నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌ పదేళ్ల పాలనలో రేషనలైజేషన్‌ పేరిట 4 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం రేవంత్‌ రూ. 2వేల కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు.

ప్రభుత్వ పాఠశాల నేపథ్యం నుంచే వచ్చిన సీఎం ఆ స్కూళ్ల అభివృద్ధికి పాటు పడుతున్నారని అన్నారు. అనంతరం విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌, కాంగ్రెస్‌ నేత మానవతారాయ్‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ పేద విద్యార్థుల పాలిట దేవుడని అన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 03:20 AM

Advertising
Advertising