ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అప్రూవర్లుగా ఇద్దరు!

ABN, Publish Date - Apr 09 , 2024 | 04:26 AM

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇద్దరు పోలీసు అధికారులు కీలకంగా మారనున్నారు! అవసరమైతే కేసులో వారి పాత్రను

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

వీరిలో ఒకరు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు నమ్మకస్తుడు

నేటితో ముగియనున్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు కస్టడీ

ఓ ఇన్‌స్పెక్టర్‌, నలుగురు కానిస్టేబుళ్ల విచారణ

పలు జిల్లాల్లో వార్‌రూంలు, ఏడు చోట్ల ట్యాపింగ్‌ కేంద్రాలు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మామిడి తోటలోనూ ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇద్దరు పోలీసు అధికారులు కీలకంగా మారనున్నారు! అవసరమైతే కేసులో వారి పాత్రను బట్టి, నిందితులుగా చేర్చి, ఆ తర్వాత అప్రూవర్లుగా మార్చే దిశలో దర్యాప్తు అధికారులు అడుగులు వేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అత్యంత విశ్వసనీయవర్గాలు అవుననే చెబుతున్నాయి. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు కూడా వారిద్దరి పేర్లను వెల్లడించినా.. దర్యాప్తు అధికారులు కనీసం నోటీసులు ఇచ్చి, వారిని విచారించిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి.. రిటైర్‌ అయ్యాక కూడా ఎస్‌ఐబీలో ఓఎస్డీలుగా కొనసాగుతున్న ఆ ఇద్దరు అధికారులు కీలక సాక్షులుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారిద్దరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డాకే.. దర్యాప్తు అధికారులు ఈ కేసులో టెలిగ్రాఫ్‌ చట్టాన్ని జోడించినట్లు(ఆల్టర్‌) తెలుస్తోంది. ఆ ఇద్దరు అధికారుల్లో ఒకరు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు అత్యంత నమ్మిన బంటుగా ఉన్నట్లు సమాచారం. నిజానికి ఈ కేసులో ప్రణీత్‌రావును విచారించడానికి ముందే.. దర్యాప్తు అధికారులు ఆ ఇద్దరు ఓఎస్డీల ద్వారా పలు జిల్లాల్లోని వార్‌రూమ్‌లు, ఏడు ప్రాంతాల్లో ట్యాపింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులకు పక్కాగా శిక్షలు పడేలా దర్యాప్తు అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పలు విషయాల్లో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు అరెస్టయిన అధికారులు-- టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, వేణుగోపాలరావు విచారణలో ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అని మాత్రమే పేర్కొన్నారు. అయితే.. ట్యాపింగ్‌ వ్యవహారానికి సూత్రధారి ఎవరు? అనేది తెలియాలంటే.. ప్రభాకర్‌రావు అరెస్టవ్వాల్సిందే. ఆయన విచారణలోనే గత ప్రభుత్వంలో ఎవరు తనతో ట్యాపింగ్‌ చేయించారు? ఇక్వి్‌పమెంట్‌ కొనుగోలుకు నిధులు సమకూర్చిందెవరు? అనే వివరాలు వెలుగులోకి వస్తాయి. అంతేకాదు.. పక్కాగా వాంగ్మూలాలు, సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే.. కోర్టులో ఈ కేసు నిలబడుతుంది. అయితే.. నిందితుల్లో ఎవరైనా అప్రూవర్‌గా మారి, నేరం జరిగిన తీరును వివరిస్తే.. దర్యాప్తు అధికారులు ఆధారాలకోసం పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు. అయితే.. అప్రూవర్‌గా మారేవారు నిందితుల జాబితాలో ఉండాలి. కోర్టు అనుమతితోనే వారిని అప్రూవర్‌గా గుర్తించాల్సి ఉంటుంది. సాక్షులుగా మారిన ఆ ఇద్దరు అధికారుల పాత్ర ఈ కేసులో ఉన్నట్లు రాధాకిషన్‌రావు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు వారిద్దరినీ నిందితులుగా చూపించి, ఆ తర్వాత అప్రూవర్లుగా మారే అవకాశం కల్పిస్తారని సమాచారం.

నగరానికి చెందిన కంపెనీ ద్వారా కొనుగోలు!

టార్గెట్‌ ఫోన్‌ చేతికి రాకుండానే.. ఆ డివైజ్‌ను ట్యాప్‌ చేసే సాంకేతికతను ఇజ్రాయెల్‌ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటారు. అయితే.. ఈ ఎపిసోడ్‌లో ప్రభాకర్‌రావు అండ్‌ కో మాత్రం నగరానికి చెందిన ఓ కంపెనీ వద్ద ట్యాపింగ్‌ పరికరాలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఆ కంపెనీ నిర్వాహకులను సైతం విచారించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

రేపటితో ముగియనున్న రాధాకిషన్‌ కస్టడీ

రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగియనుంది. దీంతో.. మంగళ, బుధవారాల్లో రాధాకిషన్‌ అండ్‌ కో కలిసి ఏయే వ్యాపారులను టార్గెట్‌గా చేసుకున్నారు? ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు ఎవరి కోసం జరిగింది? ఏయే నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ కొనసాగింది? అనే ప్రశ్నలకు సమాధానాలను రాబట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు దర్యాప్తు అధికారులు గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఓ ఇన్‌స్పెక్టర్‌, నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు కానిస్టేబుళ్లను విచారించారు. మహబూబ్‌నగర్‌, సిరిసిల్ల ‘ట్యాపింగ్‌ సెంటర్ల’లో పనిచేసినట్లు అనుమానిస్తున్న ఒకరిద్దరు ఇన్‌స్పెక్టర్లు, పలువురు కానిస్టేబుళ్లను కూడా విచారించనున్నట్లు తెలిసింది.

ఆరోపణలను ఖండిస్తున్నా: ఎమ్మెల్సీ

కూకట్‌పల్లి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో కొన్ని రోజులుగా తనపై మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రసారాలను ఖండిస్తున్నానని, అవన్నీ అసత్య ప్రచారాలని ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్‌తో తనకు ఎటువంటి సంబంధంలేదని, ఈ వ్యవహారంలో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. జూబ్లీహిల్స్‌లోని తన గెస్ట్‌హౌ్‌సలో తనిఖీలు అంటూ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలని, తన ఇంట్లోగానీ, గెస్ట్‌హౌ్‌సలోగానీ పోలీసుల తనిఖీలు జరగలేదన్నారు. కొందరు కుట్రపూరితంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. మీడియా, సోషల్‌ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించిన వారిపై న్యాయస్థానంలో కేసు నమోదు చేస్తామని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు నవీన్‌కుమార్‌ తెలిపారు.

నేలకొండపల్లి మామిడితోటలో ట్యాపింగ్‌ అడ్డా

నేలకొండపల్లి, ఏప్రిల్‌ 8: ఖమ్మం జిల్లాలోనూ ఫోన్‌ట్యాపింగ్‌ జరిగినట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ఎన్నికలకు ముందు.. నేలకొండపల్లి మండలం పైనంపల్లి రెవెన్యూ పరిధిలోని ఓ మామిడి తోటలో ఫోన్‌ట్యాపింగ్‌ పరికరాలను అమర్చినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పట్లో బీఆర్‌ఎస్‌ అసంతృప్తులుగా ఉండి.. ప్రస్తుతం కాంగ్రె్‌సలో ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు.. పలువురు ప్రముఖులే టార్గెట్‌గా ప్రభాకర్‌రావు అండ్‌ కో ఇక్కడ ట్యాపింగ్‌ పరికరాలను అమర్చినట్లు తెలుస్తోంది. ఇటీవల నిందితుల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఐబీకి చెందిన ఓ బృందం సోమవారం ఈ మామిడితోటను పరిశీలించినట్లు తెలిసింది. తోట పరిసరాల్లో ఉండేవారిని ఈ బృందం ప్రశ్నించినట్లు సమాచారం.

Updated Date - Apr 09 , 2024 | 04:26 AM

Advertising
Advertising