ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

ABN, Publish Date - Nov 25 , 2024 | 03:06 AM

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువత ఒక్క తాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి మేధోమథనం చేస్తే కచ్చితంగా త్వరతిగతిన అభివృద్ధి సాధ్యపడుతుందని నొక్కిచెప్పారు.

  • భారతీయ సంస్కృతి ప్రాభవానికిదో నిదర్శనం: మోదీ

న్యూఢిల్లీ, నవంబరు 24: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువత ఒక్క తాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి మేధోమథనం చేస్తే కచ్చితంగా త్వరతిగతిన అభివృద్ధి సాధ్యపడుతుందని నొక్కిచెప్పారు. ఆదివారం ప్రసారమైన ‘మన్‌ కీ బాత్‌’ 116వ ఎపిసోడ్‌లో మోదీ ప్రసంగించారు. స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించనున్న ‘వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌’ కార్యక్రమంలో దాదాపు 2వేల మంది యువత పాల్గొంటారని తెలిపారు. లక్ష మంది యువతను రాజకీయాలతో అనుసంధానం చేయడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.


‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ కార్యక్రమం విజయవంతమైందని, దీనికింద కేవలం ఐదు నెలల్లోనే దేశం వంద కోట్ల మొక్కలను నాటిందని అన్నారు. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. విదేశాల్లో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో, ప్రచారం చేయడంలో ఆ దేశంలోని భారత సంతతి పౌరులతో పాటు ఇర్ఫాన్‌ అలీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ‘స్లొవేకియాలో కూడా మన సంస్కృతిని పరిరక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ మన ఉపనిషత్తులను తొలిసారిగా స్లొవాక్‌ భాషలోకి అనువదించారు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి ప్రాభవానికి ప్రతిబింబాలు’ అని ప్రధాని పేర్కొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 03:06 AM