pocharam srinivas reddy: అందుకే సంబురాలు చేసుకుంటున్నాం
ABN, Publish Date - Jul 18 , 2024 | 07:02 PM
దేశ చరిత్రలోనే ఒకేసారి రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ ఎప్పుడు జరగలేదని.. ఇదే తొలిసారి అని మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అది కూడా రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.
కామారెడ్డి, జులై 18: దేశ చరిత్రలోనే ఒకేసారి రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ ఎప్పుడు జరగలేదని.. ఇదే తొలిసారి అని మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అది కూడా రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. గురువారం దేశాయిపేట రైతు వేదికపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ముఖాముఖి కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇదో గొప్ప సంఘటనగా అభివర్ణించారు. రైతుల జీవితంలో ఇంత వరకు జరగని సంఘటన ఇప్పుడు జరుగుతుందన్నారు.
తాను 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రూ. లక్ష వరకు రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. అదీకూడా రూ.25 వేలు చొప్పున నాలుగు విడతలుగా చేశామని చెప్పారు. అందుకోసం నాడు రూ.16,170 కోట్లు ఖర్చు అయిందని వివరించారు. అయితే 2018 అనంతరం రెండో విడత ప్రభుత్వంలో రూ. 20 వేల కోట్ల రుణాలు ఉండగా.. రూ.12 వేల కోట్ల వరకు మాత్రమే అందించారని తెలిపారు.
Also Read: PoK: భారత్ కోసం.. ‘పాక్ ఆర్మీ’ ఉగ్రవాద శిక్షణ
Also Read: Maharastra: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన
Also Read: Maharastra: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ‘వాఘ్ నఖా’.. రేపటి నుంచి ప్రదర్శన
ఇంకా రూ. 8 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ కాలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ నలబై లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు.. రెండు లక్షల రూపాయల వరకు ఒకేసారి అందించడం మాత్రం భారతదేశంలో ఇదే ప్రధమం అని స్పష్టం చేశారు. ఇలాంటిది గతంలో ఎప్పుడు జరగలేదని... అందుకే సంబురాలు చేసుకుంటున్నామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Also Read:India-Pakistan Border: తుపాకులు, బులెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
Also Read: Telangana: చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 18 , 2024 | 07:11 PM